ఆగడు: శృతి హాసన్ ఐటం సాంగ్ ఖరీదు చాలా ఎక్కువే!
హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'ఆగడు' చిత్రంలో శృతి హాసన్ ఐటం సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. శృతి హాసన్ ఐటం సాంగు చేయడమే ఒక ఆశ్చర్యం అయితే...ఆమె ఈ ఒక్కసాంగ్ చేయడానికి తీసుకునే రెమ్యూనరేషన్ మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఫిల్మ్ నగర్ వార్తల ప్రకారం ఐటం సాంగుకు ఆమె రూ. 50 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుందట.
ఈ మధ్య టాప్ హీరోయిన్లు ఐటం సాంగులు చేయడం, భారీగా రెమ్యూనరేషన్లు తీసుకోవడం సర్వా సాధారణం అయింది. ఇటీవల తమన్నా కూడా 'అల్లుడు శ్రీను' చిత్రంలో ఐటం సాంగ్ చేసినందుకు రూ. 40 లక్షల వరకు చార్జ్ చేసినట్లు టాక్. ఇలా హీరోయిన్లు ఐటం సాంగులు చేయడానికి సై అంటుండటం ప్రేక్షకులకు, దర్శక నిర్మాతలకు బాగానే ఉన్నా...... ఐటం గర్ల్స్ మాత్రం మాత్రం మా ఉపాది దెబ్బతింటోందని గగ్గోలు పెడుతున్నారట.
శ్రీను వైట్ల దర్శకత్వంలో 'ఆగడు' తెరకెక్కుతోంది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 19 లేదా సెప్టెంబర్ 26వ తేదీన సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు ఓ రేంజిలో పెంచింది. ఇక ట్రైలర్ అదిరిపోయే విధంగా ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన తమన్నా హీరోయిన్.

దూకుడు' తర్వాత మహేష్, శ్రీను వైట్ల కలయికలో రూపొందుతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాల్ని అందుకొనేలా 'ఆగడు'ని రూపొందిస్తున్నట్టు సినిమావర్గాలు చెబుతున్నాయి. మహేష్ శైలి వినోదం, యాక్షన్ అంశాల మేళవింపుతో సాగే ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుందని నిర్మాతలు చెప్పారు. ఖచ్చితంగా మరో హిట్ తో వస్తామని శ్రీను వైట్ల, నిర్మాతలు పూర్తి నమ్మకంగా ఉన్నారు. ఈచిత్రంలో సోనూసూద్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, నెపోలియన్, సాయికుమార్ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: తమన్, ఛాయాగ్రహణం: కె.వి. గుహన్, కళ: ఎ.ఎస్.ప్రకాశ్, కూర్పు: ఎం.ఆర్.వర్మ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పరుచూరి కోటి.


Click it and Unblock the Notifications











