కాజల్ స్థానంలో శ్రుతి హసన్, ఏ సినిమాలోనో తెలుసా ?

తెలుగులో కాటమరాయడు సినిమాలో నటించిన శ్రుతి హసన్ ఆ సినిమా తరువాత ఏ సినిమాలో చెయ్యలేదు. తాజా సమాచారం మేరకు రవితేజ పక్కన ఈ హీరోయిన్ నటిస్తోందని సమాచారం.

తేరి రీమేక్ లో రవితేజ

తేరి రీమేక్ లో రవితేజ

సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయనున్నాడని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే, ఈ ప్రాజెక్టు జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లే అవకాశం ఉంది. తమిళ్ లో మంచి విజయం సాధించిన తేరి రీమేక్ గా ఈ సినిమా రూపొందించబడుతోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

రవితేజ తో శ్రుతి హసన్

రవితేజ తో శ్రుతి హసన్

కాజల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి కాని తాజా సమాచారం మేరకు శ్రుతి హసన్ ఈ సినిమాలో నటించవచ్చని చెబుతున్నారు. శ్రుతి అయితే బాగుంటుందని దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదించడం జరిగినట్లు తెలుస్తోంది. ఆమె కూడా ఈ సినిమాలో నటించడానికి ఇష్టపడుతున్నట్లు సమాచారం.

క్యాథరిన్ సెకండ్ హీరోయిన్

క్యాథరిన్ సెకండ్ హీరోయిన్

ఈ సినిమాలో క్యాథరిన్ సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రవితేజ నటించిన తాజా సినిమా నేల టికెట్ వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో పాటు శ్రీను వైట్ల సినిమాలో నటిస్తున్నాడు రవితేజ.

ఆగస్ట్ నుండి ఆనంద్ సినిమా

ఆగస్ట్ నుండి ఆనంద్ సినిమా

సంతోష్ శ్రీనివాస్, శ్రీను వైట్ల సినిమాల తరువాత వి.ఐ.ఆనంద్ సినిమాలో నటిస్తున్నాడు రవితేజ. డిస్కో రాజా పేరుతో తెరకేక్కబోయే ఈ సినిమాకు సంభందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకేక్కబోయే ఈ సినిమా ఆగస్ట్ నుండి ప్రారంభం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X