మహేశ్ - రాజమౌళి ప్రాజెక్టుపై షాకింగ్ న్యూస్: అంత కాలం వెయిట్ చేయాల్సిందేనా!
సినీ పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లు ఎంతో ప్రత్యేకంగా నిలుస్తూ ఉంటాయి. అందుకే వాళ్ల అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా ఫలానా హీరో, ఫలానా దర్శకుడు కలిసి పని చేయాలని కోరుకుంటూ ఉంటారు. అలా టాలీవుడ్‌లో చాలా మంది వేచి చూస్తోన్న కాంబినేషన్లలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి జోడీ ఒకటి. తమ తమ రంగాల్లో బడా స్టార్లుగా వెలుగొందుతోన్న వీళ్లిద్దరూ కలిసి సినిమా చేయాలని ఎంతో మంది కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ జంట సినిమా చేయబోతున్నట్లు ప్రకటించింది. మరికొన్ని రోజుల్లోనే రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు నటించబోతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ప్రాజెక్టు గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటో మీరే చూడండి!

రాజమౌళి హిట్.. మహేశ్ మాత్రం
వరుస హిట్లతో ఫుల్ ఫామ్‌తో ఉన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఈ జోష్‌తోనే ఇటీవలే 'సర్కారు వారి పాట' అనే సినిమాతో వచ్చాడు. అయితే, ఇది కలెక్షన్ల టార్గెట్‌ను మాత్రం చేరుకోలేదు. ఇక, రాజమౌళి ఇటీవలే RRRతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో భారీ విజయాన్ని అందుకున్నారు. ఇది ఊహించినట్లుగానే అత్యధిక కలెక్షన్లు రాబట్టి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.

తొలిసారి ఇద్దరి కాంబోలో మూవీ
తన చిత్రాలతో తెలుగు సినిమా స్థాయిని అంతకంతకూ పెంచుతూ పోతోన్న రాజమౌళితో ఒక్క సినిమా అయినా చేయాలని స్టార్లు అందరూ కోరుకుంటూ ఉంటారు. దీంతో ఆయన ఎవరితో సినిమాలు చేస్తాడన్నది పెద్ద చర్చ అవుతోంది. ఈ నేపథ్యంలో రాజమౌళి తన తదుపరి సినిమాను సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేయబోతున్నాడు. వీళ్లిద్దరూ దీన్ని కన్ఫార్మ్ చేసేశారు.

రాజమౌళి తండ్రి చేతిలో స్క్రిప్ట్
మహేశ్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కించే సినిమాపై అందరూ దృష్టి సారించారు. దీంతో ముందు నుంచే దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ మూవీ స్టోరీపి తయారు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఈ ప్రాజెక్టు స్క్రిప్ట్ బాధ్యతను జక్కన్న ఇప్పటికే తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు అప్పగించినట్లు స్వయంగా వెల్లడించాడు.

సినిమా కథపై ఎన్నో ప్రచారాలు
టాలీవుడ్‌లోనే టాప్ స్టార్లుగా వెలుగొందుతోన్న మహేశ్ బాబు, రాజమౌళి కాంబోలో రాబోయే ఈ ప్రాజెక్టు గురించి చాలా రోజులుగా ఎన్నో వార్తలు వైరల్ అవుతోన్నాయి. మరీ ముఖ్యంగా ఈ మూవీ స్టోరీ గురించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇది సైన్స్ ఫిక్షన్ నేపథ్యం ఉన్న కథతో రూపొందనుందని కొందరు.. ఫారెస్ట్ బ్యాగ్‌డ్రాప్‌తో అడ్వెంచర్ ఫిల్మ్‌గా రానుందని మరికొందరు అంటున్నారు.

ఎప్పుడు మొదలవుతుందో అని
నిజానికి మహేశ్ బాబు.. ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా గత ఏడాది చివర్లోనే మొదలవుతుందని అంతా అనుకున్నారు. కానీ, కరోనా కారణంగా RRR వాయిదా పడడంతో ఈ ప్రాజెక్టు కూడా ఆలస్యం అయింది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు కూడా త్రివిక్రమ్‌తో సినిమాను చేస్తున్నాడు. అంటే అది పూర్తయ్యాకే ఈ సినిమా ప్రారంభం కాబోతుందని తేలిపోయింది.

అంత కాలం వేచి చూడాల్సిందే
క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ భారీ ప్రాజెక్టు గురించి తాజాగా ఓ షాకింగ్ న్యూస్ లీకైంది. దీని ప్రకారం.. ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో పట్టాలెక్కబోతుందట. అది కూడా సవ్యంగా అనుకున్నవి అన్నీ అయితేనే అప్పుడు మొదలు పెడతారట. లేకుంటే 2024లో ప్రారంభంలో దీన్ని ప్రారంభించే ఛాన్స్ కూడా ఉందని అంటున్నారు. అంటే ఈ మూవీ రావాలంటే ఈజీగా మూడు, నాలుగేళ్లు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











