SSMB29 మహేష్ బాబు, రాజమౌళి సినిమా ఓపెనింగ్ డేట్ ఫిక్స్.. ఏ రోజు ప్రారంభం అంటే?
బాహుబలి, RRR చిత్రాలతో చరిత్ర సృష్టించిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో సినిమా రూపొందుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఎప్పుడెప్పుడూ చూడాలని కుతుహలంతో ఉన్న అభిమానులకు శుభవార్త బయటకు వచ్చింది. మహేష్ బాబు కెరీర్‌లో 29వ సినిమాగా తెరకెక్కే SSMB29 సినిమాకు సంబంధించి అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే..
మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చే SSMB29 మూవీ ఆఫ్రికన్ జంగిల్ అడ్వంచర్ డ్రామాగా తెరకెక్కనున్నది. ఈ సినిమా ఆగస్టు 9వ తేదీ మహేష్ బాబు జన్మదినం రోజున ఈ సినిమాను ప్రారంభిస్తారు. ఈ వేడుకను భారీ ఎత్తున్న నిర్వహించి SSMB29 సినిమాను అధికారికంగా ప్రకటిస్తారు. 2024లో షూటింగ్‌కు వెళ్తారు అని తెలిసింది.

SSMB29 సినిమా కథ కోసం ఎస్ఎస్ రాజమౌళి మరో రెండు నెలల సమయాన్ని తీసుకొంటారు. స్క్రిప్టును పూర్తి చేసిన తర్వాత మహేష్ బాబుకు మళ్లీ కథను నేరేట్ చేస్తారు. ఆ తర్వాత మార్పులు, చేర్పులు చేసి సినిమా ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా చేస్తారు అని సినీ వర్గాలు వెల్లడించాయి.
SSMB29 చిత్రంలో విలన్‌గా బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్‌ను తీసుకొంటున్నారనే వార్తలను ఆయన సన్నిహితులు కొట్టిపడేశారు. అమీర్ ఖాన్‌ను ఈ సినిమాలో నటిస్తున్నారనే వార్త కేవలం రూమర్ మాత్రమే. ఇంకా ఈ సినిమా కోసం ఎవరినీ కూడా సంప్రదించలేదు. ఏదైనా ఉంటే అధికారికంగా మీడియాకు వెల్లడిస్తారు అని చిత్ర యూనిట్ వెల్లడించాయి.

మీడియాలో ప్రచారం అవుతున్న వివరాల ప్రకారం.. జంగిల్‌లో ఉండే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే వీరుడి పాత్రలో మహేష్ కనిపించబోతున్నారు. ఆయన పాత్ర హనుమంతుడి మాదిరిగా ఉంటుంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ వరల్డ్ స్థాయిలో ఉండే ప్యాన్ ఇండియాగా నిర్మిస్తున్నారు అని సినీ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











