ఆ సినిమా కోసం రెండవ నిర్మాతను లాగుతున్న రాజమౌళి.. మరో హై బడ్జెట్ మూవీ!

దర్శక ధీరుడు రాజమౌళి ఎలాంటి సినిమా చేసినా కూడా అంతకుమించి అనేలా ఉండాలని ఆలోచిస్తూ ఉంటాడు. బాహుబలి సినిమా తర్వాత ఆయన ఆలోచన విధానం మరింత ఉన్నత స్థాయికి పెరిగిపోయింది అనే చెప్పాలి. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న RRR సినిమా పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజుగా అలరించబోతున్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇద్దరు కూడా మొదటిసారి కలిసి నటించడమే కాకుండా బలమైన పాత్రలతో కనిపించబోతున్నారు.

ఈ సినిమాలో యాక్షన్ తో పాటు ఎమోషనల్ డోస్ కూడా అంచనాలకు తగ్గట్లుగానే ఉంటుందట. ఇప్పటికే విడుదలైన టీజర్స్ సాంగ్స్ కూడా మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇక సినిమాపై అంచనాలు అయితే ఆకాశాన్ని దాటేశాయి. తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సినిమా అంతకు మించి అనేలా ఉంటుంది అని ఇప్పటికే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక బడ్జెట్ అయితే 450 కోట్లు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. జనవరి 7వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఇండియాలోని అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Ss Rajamouli collaborating another production house for mahesh babu film

ఇక ఆ సినిమా తర్వాత రాజమౌళి చేయబోయే మరొక ప్రాజెక్టు పై కూడా అంచనాలు పెరిగిపోతున్నాయి. మహేష్ బాబు కోసం రాజమౌళి ఇప్పటికే ఒక కథను రెడీ చేయించాడు. రచయిత కె.విజయేంద్ర ప్రసాద్ కూడా ఆ ప్రాజెక్టు పై ఇదివరకే ఒక క్లారిటీ ఇచ్చాడు. మహేష్ బాబుతో చేయబోయే సినిమా అంతకుమించి ఎలా ఉంటుందని ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లోనే సినిమా వెండితెరపైకి రాబోతున్నట్లు వివరణ ఇచ్చారు. అయితే ఆ సినిమాను సీనియర్ నిర్మాత కె.ఎల్ నారాయణ నిర్మించబోతున్న విషయం తెలిసిందే.

శ్రీ దుర్గా ఆర్ట్స్ పై నిర్మించబోయే ఈ సినిమా కోసం కూడా మూడు వందల కోట్లకు పైగా ఖర్చు చేసే అవకాశం ఉందట. అయితే ఒక్క నిర్మాత అది సాధ్యం కాదు అని రాజమౌళి మరొక స్టార్ ప్రొడ్యూసర్ ను రంగంలోకి దింపుతున్నాడు. ఆ నిర్మాత మరెవరో కాదు వరుసగా బాక్సాఫీస్ హిట్స్ తో దూసుకుపోతున్న దిల్ రాజు అని తెలుస్తోంది. దిల్ రాజు కూడా రాజమౌళితో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. దాదాపు రాజమౌళి ప్రతి సినిమా నైజం హక్కులను దిల్ రాజు సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే.

ఇక ఈ సారి కూడా మహేష్ బాబు తో చేయబోయే ప్రాజెక్టులో కె.ఎల్.నారాయణ తో పాటు దిల్ రాజు కూడా చేతులు కలుపుతున్నాడు. ఆ విధంగా రాజమౌళితో సినిమాని నిర్మించాలన్న కోరిక కూడా నెరవేరుతుంది. మరి ఇది బడా కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. అలాగే మహేష్ బాబుతో కూడా దిల్ రాజుకు మరొక కమిట్మెంట్ కూడా ఉంది కాబట్టి అన్ని రకాలుగా ఈ కాంబినేషన్ ఒక్క ప్రాజెక్ట్ తో స్ట్రాంగా గా సెట్టవుతుందని చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X