ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ కన్ఫర్మ్...డిటేల్స్
ఎన్టీఆర్ అభిమానులు ఇది మరో శుభవార్త. గతంలో యమదొంగ,సింహాద్రి,స్టూడెంట్ నెంబర్ వన్ వంటి విజయాలను ఎన్టీఆర్ కి అందించిన రాజమౌళి మరోసారి ఎన్టీఆర్ ని డైరక్ట్ చేయనున్నారు. వచ్చే సంవత్సరం మేలో ఈ చిత్రం ప్రారంభమవనుంది. ఈ చిత్రాన్ని కె.ఎల్.నారాయణ..తమ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తారు. ఈ మేరకు రాజమౌళి చెప్పిన లైన్ ని ఎన్టీఆర్ ఓకే చేసినట్లు తెలుస్తోంది. దాంతో రాజమౌళి స్టోరీ డిపార్టమెంట్ ఈ స్క్రిప్టు రూపకల్పనలో ఉన్నారు. ఇక రాజమౌళి ప్రస్తుతం ఈగ చిత్రం ప్రారంబించేందుకు సిద్దమవుతున్నారు. ఆ తర్వాత ప్రభాస్ తో చేసే సినిమా ఉంటుంది. అనంతరం ఎన్టీఆర్ చిత్రం మొదలుకానుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ శక్తి చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత సురేంద్రరెడ్డి తో ఊసరవిల్లి చేసి రాజమౌళి చిత్రానికి వస్తారు.
జూ ఎన్టీఆర్ రాజమౌళి సునీల్ మర్యాద రామన్న సింహాద్రి స్టూడెంట్ నెంబర్ వన్ jr ntr rajamouli sunil maryada ramanna yamadonga


Click it and Unblock the Notifications