స్టార్ డైరక్టర్ రాజమౌళిని చిర్రెత్తిస్తున్న 'మిస్టర్ ఫర్ ఫెక్ట్' ప్రభాస్
ఈగ చిత్రం అనంతరం ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనుందన్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా ప్రభాస్ చేష్టలపై ప్రముఖ దర్శకుడు రాజమౌళి చాలా చిరాకుపడినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. దానికి కారణం..రాజమౌళి రీసెంట్ గా ప్రబాస్ కోసం తయారు చేసిన స్క్రిప్టు ని నేరేట్ చేస్తే దాంట్లో ఇంతకు ముందు లేని విధంగా కొన్ని సూచనలు చేసాట్ట. దాంతో తన స్క్రిప్టులో ఎవరి ప్రమేయం ఇష్టపడని రాజమౌళి చిరాకుపడ్డాడని చెప్పుకుంటున్నారు. ఇక ప్రబాస్ ఈ మధ్య చేసిన డార్లింగ్, మిస్టర్ ఫర్ ఫెక్ట్ చిత్రాల స్క్రిప్టుల విషయాల్లో సూచనలు, సలహాలు ఇవ్వటం అవి హిట్టవటంతో ఈ పని చేసాడని, తనకు ఉన్న స్క్రిప్టు నాలెడ్జ్ ని నమ్మకాన్ని రాజమౌళి ముందు ప్రదర్శించబోయాడని చెప్పుకుంటున్నారు. అయితే ప్రభాస్ కొన్ని కరెక్షన్స్ అయితే చెప్పాడని, ఇలా ఉంటే బావుంటుందేమో అన్నట్లు సూచించాడని, దాన్నే పెద్దది చేసి చెప్పుకుంటున్నాడని కొందరు అంటున్నారు. అలాగే ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న రెబల్ చిత్రం స్క్రిప్టులోనూ చాలా మార్పులు చేసాడని, లారెన్స్ ఫ్లాపుల్లో ఉండటంతో వేరే దారిలేక అన్నీ ఓకే చేసాడని వార్త. ఇక ప్రభాస్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ చిత్రానికి నాగచైతన్య తాజా చిత్రం 100 % లవ్ చాలా చోట్ల పోటీ ఇస్తోందని కొన్ని చోట్ల కలెక్షన్స్ డ్రాపయ్యాయని ట్రేడ్ వార్త.


Click it and Unblock the Notifications











