SS Rajamouli: మహేశ్ బాబు కోసం ముగ్గురు భామలు... జక్కన్న ప్లాన్‌కి మైండ్ పోతుందిగా!
ఎస్ఎస్ రాజమౌళి... తీసింది 12 సినిమాలు.. అయినా ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా తెలుసు. దానికి కారణం బహుబలి సిరిసులతో ఇండియా వైడ్ గా గుర్తింపు లభిస్తే.. ఆర్ఆర్ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ గుర్తింపు కొట్టేశాడు. రాజమౌళి సినిమాలు అంటే.. కేవలం కలెక్షన్లు మాత్రమే కాదు.. అవార్డులు కూడా వస్తాయని ఇండియాకు ఆస్కార్ అవార్డు తీసుకువచ్చి నిరూపించాడు. ఇక ఆయన నెక్ట్స్ మూవీ మహేశ్ బాబుతో అనౌన్స్ చేశారు. ఇక అప్పటి నుంచి ఏవో ఒక రూమర్స్ వస్తునే ఉన్నాయి. తాజాగా మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ గా క్రేజ్, పాపులారిటీని దక్కించుకున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డును తీసుకువచ్చి.. ప్రతి ఒక్క భారతీయుడిని గర్వపడేలా చేశాడు. ఆస్కార్ అవార్డే కాదు.. జాతీయ అవార్డులు సైతం తీసుకువచ్చాడు జక్కన్న. ఇక జక్కన్న సినిమాలో నటించాలంటే అదృష్టం ఉండాల్సిందే అనుకుంటారు నటులు. తాజాగా జక్కన్న మహేశ్ బాబుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా తర్వాత పూర్తిగా జక్కన్న ఆధీనంలోకి వెళ్లిపోతాడు మహేశ్ బాబు.
జక్కన్న కూడా మహేశ్ బాబు సినిమా కోసం స్క్రిప్టు పనులు పూర్తి చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు ఈ సినిమాను డిసెంబర్ లో ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారట. పాన్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రెండు పార్టులుగా తీసుకురానున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ రేంజులో ఈ సినిమా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పనులు పూర్తి అయినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా క్యాస్టింగ్ విషయంలో రాజమౌళి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మహేశ్ సరసన ఇద్దరు టాప్ హీరోయిన్లను తీసుకోవాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే లాంటి స్టార్ హీరోయిన్లను తీసుకోవాలని అనుకుంటున్నారని సమాచారం. ఇక ప్రియాంకకు హాలీవుడ్ రేంజులో గుర్తింపు ఉంది. ఆ క్రేజ్ తన సినిమాకు వాడుకోవాలని జక్కన్న ప్లాన్. ఇక దీపికాకు ఇండియాలో సూపర్ క్రేజ్ ఉంది.

మరోవైపు ఈ సినిమాలో లేడీ విలన్ పాత్ర కోసం.. ఐశ్వర్య రాయ్ ను తీసుకోవాలని అనుకుంటున్నారు జక్కన్న. జక్కన్న డైరెక్షన్లో నటించాలి అని ఐశ్వర్య రాయ్ కూడా అనుకుంటుందంట. అందుకే విలన్ రోల్ అయినా సరే యాక్సెప్ట్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇలా మహేశ్ కోసం ముగ్గురు భామలను రంగంలోకి దించనున్నాడు జక్కన్న. రాజమౌళి ప్లాన్ తెలుసుకున్న ఫ్యాన్స్... మైండ్ పోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











