SSMB 29: మహేష్ -రాజమౌళి మూవీకి టైటిల్ ఛేంజ్... కొత్త పేరేంటో తెలుసా?
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురు చూసే సినిమాల్లో SSMB 29 కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమాకు దర్శకత్వం వహించేది దర్శకధీరుడు రాజమౌళి. అందుకే ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న వార్త వచ్చినా అది సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. అయితే తాజాగా మరో ఆసక్తికరమైన న్యూస్ ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొట్టడం ప్రారంభమైంది. అదేంటంటే ఈ సినిమా వర్కింట్ టైటిల్‌ను మార్చబోతున్నారని తెలిసింది. మరి ఇంతకీ ఆ టైటిల్ ఏంటి? అనే విషయంతో పాటు సినిమాకు సంబంధించి ఇతర విషయాలను తెలుసుకుందాం.
వివరాల్లోకి వెళితే... SSMB 29 ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీతో పాటు వరల్డ్ వైడ్‌గా మోస్ట్ అవైటెడ్ సినిమా ఇది. అమెజాన్ ఫారెస్ట్ అండ్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందబోతున్న ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల అందరి దృష్టి దీనిపైనే ఉన్నాయి. ఎందుకంటే ఆర్ఆర్ఆర్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ను తెరకెక్కించిన జక్కనే దీన్ని తెరకెక్కిస్తున్నారు. అందుకే SSMB 29 కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రీసెంట్‌గానే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తైంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా సాగుతోంది. సినిమాలో హీరోగా నటిస్తున్న మహేశ్ కూడా తన లుక్స్‌ను, శరీరాకృతిని మార్చే పనిలో ఉన్నారు. అలాగే ఇతర అంశాలకు సంబంధించి శిక్షణ కూడా తీసుకుంటున్నారు. అయితే గత కొన్ని రోజులుగా రాజమౌళి ఈ చిత్రం కోసం తన మొత్తం టీమ్‌ను ఛేంజ్ చేయబోతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. బయట చక్కర్లు కొడుతున్న బజ్ ప్రకారం ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎం ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఈయన్ను తప్ప తన మిగతా టీమ్‌ను జక్కన్న మార్చారట.
ఈ సారి పిఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్‌గా, ఆర్సి కమల్ కన్నన్ వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా, తమ్మి రాజు ఎడిటర్‌గా, మోహన్ బింగి ప్రొడక్షన్ డిజైనర్‌గా, వ్యవహరించబోతున్నారని అంటున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్‌గా రాజమౌళి సతీమణి రమ బాధ్యతలు చూసుకోనున్నారు. హీరోయిన్గా ఇండోనేషియాకు చెందిన ఓ నటి నటించనుందని చెబుతున్నారు. అయితే ఈ విషయాలపై ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.
ఇప్పుడు తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. అదేంటంటే ఈ చిత్ర వర్కింగ్ టైటిల్‌ను మార్చనున్నారట. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ ప్రాజెక్టును మొదటి నుంచి SSMB29 అనే పిలుస్తున్నారు. అయితే ఇప్పుడు జక్కన్న ఈ వర్కింగ్ టైటిల్‌నే మార్చబోతున్నారట. SSMB29ను SSRMBగా మార్చబోతున్నారని బయట కథనాలు కనిపిస్తున్నాయి. అందుకు కారణం రాజమౌళి క్రేజ్ అని అంటున్నారు. ఎందుకంటే మహేశ్ క్రేజ్ టాలీవుడ్ వరకు మాత్రమే ఉంది.

అంతర్జాతీయ స్థాయిలో పోల్చుకుంటే జక్కన్న కన్నా తక్కువే. అసలీ చిత్రానికి ఇంత రేంజ్లో హైప్ పెరగడానికి కారణం రాజమౌళికి ఉన్న గుర్తింపే. ఆయన దర్శకత్వం, విజన్‌కు ఈ సినిమా హైప్ నెక్స్ట్ లెవెల్‌కు చేరింది. పాన్ వరల్డ్ రేంజ్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగేదంతా కూడా జక్కన్న వల్లనే. అందుకే ఈ సినిమా వర్కింగ్ టైటిల్‌ను SSRMBగా మార్చడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. చూడాలి మరి ఏం జరుగుతుందో..


Click it and Unblock the Notifications











