twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Rajamouli ప్రాజెక్ట్ కోసం మహేష్ స్పెషల్ ప్లాన్.. త్రివిక్రమ్ తో ఫినిష్ అయ్యాకే.. రిలీజ్ ఎప్పుడంటే?

    |

    దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన RRR సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబు తో ఎలాంటి సినిమా చేస్తాడు అనేది ప్రస్తుతం సినిమా ప్రపంచం లో చర్చనీయాంశంగా మారింది. ఇదివరకే ఆ సినిమాకు సంబంధించి కొన్ని రూమర్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక ఆ ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుంది అందుకోసం మహేష్ బాబు ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక ప్రాజెక్టు ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఇప్పుడు అనే వివరాల్లోకి వెళితే...

    పదేళ్ల నుంచి..

    పదేళ్ల నుంచి..

    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలి అని దర్శక ధీరుడు రాజమౌళి గత పదేళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. మధ్యలో ఒక ప్రాజెక్టు ఫిక్సైనట్లు టాక్ కూడా వచ్చింది. నిజానికి మహేష్ బాబు కూడా రాజమౌళితో సినిమా చేయాలని ఆలోచనతోనే ఉన్నాడు అయితే వీరిద్దరు కూడా ముందుగా ఒప్పుకున్నా కమిట్మెంట్స్ కారణంగా అలాగే సరైన స్లాట్ దొరకకపోవడంతో ప్రాజెక్టు సెట్టవ్వడానికి చాలా సమయం పట్టింది.

    హాలిడేస్ లో రాజమౌళి

    హాలిడేస్ లో రాజమౌళి

    ఏదేమైనా సరే మొత్తానికి కాంబినేషన్ అయితే సెట్ అయింది. దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం హాలిడేస్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సాధారణంగా రాజమౌళి తన ప్రతీ సినిమా విడుదల తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేకంగా విహార యాత్రలకు వెళుతూ ఉంటాడు. ప్రస్తుతం ఆయన దుబాయ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు మహేష్ కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.

    ఐదు నెలల టార్గెట్

    ఐదు నెలల టార్గెట్

    ఇక మహేష్ బాబు రాజమౌళి ఇద్దరు కూడా హాలిడేస్ ముగించుకున్న అనంతరం వారి తదుపరి సినిమాల విషయంలో ఒక నిర్ణయానికి రాబోతున్నారు. ముందుగా మహేష్ బాబు అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు. ఆ సినిమా ఇదివరకే లాంచ్ అయిన విషయం తెలిసిందే. ఇక రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలోనే మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాను మహేష్ బాబు ఈ ఏడాది చివరిలో ఫినిష్ చేయాలని కేవలం ఐదు నెలల వ్యవధిలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుంది అని కూడా తెలుస్తోంది.

     ఆరు నెలలు స్క్రిప్ట్ కోసమే..

    ఆరు నెలలు స్క్రిప్ట్ కోసమే..

    ఇక రాజమౌళి మహేష్ బాబు కలయికలో వచ్చే సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విషయం లోకి వెళితే.. ఈ ప్రాజెక్టు స్క్రిప్ట్ అయితే ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదు. ముందుగా రాజమౌళి స్క్రిప్ట్ కోసమే కొన్ని నెలల సమయం తీసుకుంటాడు. ఫైనల్ స్క్రిప్ట్ రెడీ అయ్యింది అంటే డైరెక్ట్ గా షూటింగ్ కు వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటాడు. ఇక రాజమౌళి దాదాపు ఐదు నెలల నుంచి ఆరు నెలల వరకు స్క్రిప్ట్ వర్క్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది

    విడుదల ఎప్పుడంటే?

    విడుదల ఎప్పుడంటే?

    ఇక ఈ ఏడాది చివర్లోనే మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్ట్ పెట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆ లోపు త్రివిక్రమ్ సినిమా కు సంబంధించిన అన్ని పనుల్ని పూర్తి చేసుకోనున్న మహేష్ బాబు రాజమౌళి కోసం సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. ఇక రాజమౌళి ఒక ఏడాదిలో షూటింగ్ పూర్తి చేసి సినిమాను 2024 సమ్మర్లో లేదా ఆ తర్వాత ప్రేక్షకుల ముందుకు తీసుకు రావచ్చు అని తెలుస్తోంది. సాధారణంగా రాజమౌళి ఏ సినిమా చూసుకున్నా కూడా ఆయన మొదట అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు రాలేదు. మరి మహేష్ సినిమానైనా ఒక ఏడాదిలో ఫినిష్ చేస్తాడో లేదో చూడాలి.

    English summary
    SS Rajamouli mahesh babu project latest plan update and movie release date
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X