SSMB29కు ఎన్ని ఏళ్లు పడుతుందో తెలుసా? రన్ టైమ్, రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి - సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కేఎల్ నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సుమారు 1000 కోట్ల రూపాయలు వెచ్చించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టు సంబంధించిన షూటింగ్ పార్ట్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు రెండు షెడ్యూల్ లను జక్కన్న పూర్తి చేయడం విశేషం. ప్రస్తుతం మూడో షెడ్యూల్ హైదరాబాద్ లోనే షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది.
ఇక ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఫిమేల్ లీడ్ లో నటిస్తుండడం విశేషంగా మారింది. దాంతో సినిమా మార్కెట్ కూడా భారీగా పెరిగిపోనుందని ట్రేడ్ వర్గాల అంచనా వేశాయి. మరోవైపు సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు ఎస్ ఎస్ ఎన్ బి 29 పై భారీ అంచనాలను పెంచేసింది. ఈ ప్రాజెక్టుకు స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ కథను అందించారు. అమెజాన్ అడవుల్లో సాగే యాక్షన్ అడ్వెంచర్ గా సినిమా రూపుదిద్దుకుంటుంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు.

అయితే జక్కన్న తన సినిమాలను ఎంత ఆలస్యంగా పూర్తి చేస్తారో తెలిసింది. ప్రతి ఫ్రేమ్ పర్ఫెక్ట్ గా సెట్ చేసేందుకు రాజమౌళి ఎంతగానో కృషి చేస్తుంటారు. ఏమాత్రం తేడా ఉన్నా మళ్లీ మళ్లీ తీసేందుకు ఏమాత్రం వెనకాడరు. ఎంతో సహనం, ఓపికతో తను విజువలైజ్ చేసిన దృశ్యం వచ్చేవరకు టేక్స్ తీసుకుంటూనే ఉంటారు. ఆర్టిస్టులను కూడా తనదైన శైలిలో పిండి మరి అవుట్ పుట్ తీసుకుంటారు. దాంతో జక్కన్న దర్శకత్వంలో వచ్చే సినిమాలు ఏళ్ల తరబడి సమయాన్ని తీసుకుంటూ ఉంటాయి.
రెబల్ స్టార్ ప్రభాస్ తో నిర్మించిన చిత్రం బాహుబలి, బాహుబలి 2 ఏకంగా 5 ఏళ్ల సమయం పట్టాయి. ఇక ఆస్కార్ అవార్డును కొట్టిన ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని కూడా రాజమౌళి రెండేళ్ల పాటు చిత్రీకరించారు. ఇక హాలీవుడ్ రేంజ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో ssmb 29 ను రూపొందించాలనే పట్టుదలతో ఉన్న జక్కన్న ఈ ప్రాజెక్టును ఎన్ని ఏళ్లలో పూర్తి చేస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. కాగా రాజమౌళి ఎస్ఎస్ఎంబి 29ను రెండున్నర ఏళ్ల సమయంలో నిర్మించబోతున్నారని తెలుస్తోంది.
అయితే తాజాగా రాజమౌళి మహేష్ బాబు చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఒకటి అందింది. జక్కన్న సినిమాలను ప్రేక్షకులు థియేటర్లలో ఎంత నిడివి ఉన్న చూసేందుకు ఇష్టపడుతుంటారు. కాగా, మహేష్ బాబుతో తెరకు ఎక్కిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం రన్ టైం ను 3 గంటల 30 నిమిషాల వరకు ఉండేలా షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్స్ ఉండబోదని, ఈ డ్యూరేషన్ లోనే సినిమాను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు 2027 సమ్మర్లో ssmb 29 చిత్రాన్ని రిలీజ్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు అంట మన దర్శక ధీరుడు రాజమౌళి. ఇక మున్ముందు చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడు వస్తాయోనని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే బయటికి వచ్చిన విజువల్స్ చూసి షాక్ అవుతున్నారు. మరోవైపు జక్కన్న కూడా ఎలాంటి లీక్ లు జరగకుండా జాగ్రత్తలు వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











