SS Rajamouli: రాజమౌళి, మహేశ్ మూవీ బిగ్ అప్డేట్.. అప్పటికల్లా షూటింగ్ కంప్లీట్!

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా నుంచి ఓ బిగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఫ్యాన్స్.. ఈ సినిమా కోసం ఎంత ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. కనీసం చిన్న పోస్టర్, చిన్న అప్డేట్ ఇచ్చినా చాలు అన్నట్లుగా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ బయటకు వచ్చాయి. అందులో ఒకటి షూటింగ్ అప్డేట్ తో పాటు మరికొన్ని ఆసక్తికర విషయాలు లీక్ అయ్యాయి. ఆ అప్డేట్స్ ఏంటో ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.

సూపర్ మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత రిపీట్ అవుతున్న కాంబినేషన్ కావడంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ మూవీ నుంచి ఇప్పిటికే గ్లింప్స్ తో పాటు.. ఇటీవల ఓ పాట రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది.

SS Rajamouli Mahesh Babu SSMB 29 Movie Shooting Update News Goes Viral

ఇక గుంటూరు కారం సినిమా అయిపోతే... మహేశ్ బాబు రాజమౌళితో జాయిన్ కానున్నాడు. ఇక మహేశ్ ఫ్యాన్స్ గుంటూరు కారం సినిమా కంటే.. ఎక్కువగా జక్కన్న సినిమా కోసమే వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం జక్కన్న మహేశ్ సినిమాకి సంబంధించిన కథని తన తండ్రితో కలసి ప్రిపేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి ఇది ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడు అడ్వెంచర్ డ్రామా అని ఇప్పటికే చెప్పుకువచ్చారు.

అడవుల్లో ఎక్కువ భాగం షూటింగ్ ఉంటుందని తెలిపారు. అయితే ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదలై చాలా రోజులు గడుస్తున్నా ఇంతవరకు మహేష్, రాజమౌళి మూవీ ప్రారంభం కాలేదని ఫ్యాన్స్ మాత్రం నిరాశలో ఉన్నారు. అయితే ఎట్టకేలకు మహేష్, రాజమౌళి మూవీ పనులు మొదలైనట్లు సమాచారం బయటకు వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ బిగ్ అప్డేట్ నెట్టింట హల్ చల్ చేస్తుంది.

SS Rajamouli Mahesh Babu SSMB 29 Movie Shooting Update News Goes Viral

ఇక ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి షూటింగ్ మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక డిసెంబర్ లోగా ఈ సినిమా స్క్రీన్ ప్లే లాక్ చేయాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ మొదట సెంథిల్ కుమార్ అనుకున్నారు. ఎందుకంటే.. రాజమౌళి సినిమాలకు ఆయనే సినిమాటో గ్రాఫర్. కానీ ఈ సినిమాకు ఆయన సినిమాటోగ్రాఫర్ కాదని తెలుస్తోంది.మహేశ్ రాజమౌళి చిత్రానికి సినిమాటో గ్రాఫర్ గా పీఎస్ వినోద్ ను ఫైనల్ చేసినట్లు సమాచారం.

SS Rajamouli Mahesh Babu SSMB 29 Movie Shooting Update News Goes Viral

దీంతో సెంథిల్ ను కాదని వినోద్ కు ఎందుకు ఇచ్చారని పెద్ద చర్చనడుస్తోంది. పీఎస్ వినోద్ ఎక్కువగా త్రివిక్రమ్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం తెరకెక్కుతున్న గుంటూరు కారం చిత్రానికి పిఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్ గా ఉన్నారు. అయితే అసలు విషయం ఏంటంటే.. సెంథిల్ కుమార్.. ఓ సినిమాను డైరెక్ట్ చేసే పనిలో ఉన్నారని టాక్ వినిపిస్తుంది. అందుకే రాజమౌళి, మహేష్ చిత్రానికి అందుబాటులో లేరని తెలుస్తోంది. ఇక మహేశ్ బాబు మూవీ వచ్చే ఏడాది ప్రారంభం కానుందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X