మహేష్ తరువాత బాలీవుడ్ హీరోతో రాజమౌళి బిగ్ మూవీ.. వైరల్ అవుతున్న న్యూ టాక్!
RRR తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న రాజమౌళి మరల తన నెక్స్ట్ సినిమా పనిలో బిజీగా ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఈ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించడానికి జక్కన్న సిద్ధం అవుతున్నారు. దానికి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందనే క్లారిటీ ఇప్పటికే ఇచ్చేశారు.
వరల్డ్ అడ్వంచర్ ట్రావెలర్ గా ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కనిపిస్తాడు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ మూవీ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం నడుస్తోంది. ఈ ఏడాది ఆఖరులో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసి క్యాస్టింగ్ సెలక్షన్ కూడా పూర్తి చేయనున్నారంట. అలాగే వర్క్ షాప్ కూడా నిర్వహించనున్నారని టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా పూర్తి చేసిన తర్వాత రాజమౌళి నెక్స్ట్ మూవీ ఎవరితో చేసే ఛాన్స్ ఉంది అనే ప్రశ్న చాలా రోజుల నుంచి వినిపిస్తోంది. అయితే జక్కన్న దృష్టి అంతా ఇప్పుడు సూపర్ స్టార్ తో చేయబోయే సినిమా మీదనే ఉండటంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ రాలేదు. మహాభారతం చేసే ఉద్దేశ్యంలో ఉన్నా అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చెప్పలేదు.
అయితే తాజాగా ఒక ప్రచారం తెరపైకి వచ్చింది బాలీవుడ్ స్టార్ హీరోతో రాజమౌళి నెక్స్ట్ సినిమా చేయనున్నారంట. ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ స్టార్స్ రాజమౌళితో ఒక్క సినిమా అయిన చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆయన ఆలోచనలలో టాలీవుడ్ హీరోలు మాత్రమే ఎక్కువ ఉంటారు. ప్రస్తుతానికి అయితే మహేష్ బాబు సినిమాపైనే రాజమౌళి ఫోకస్ అంతా ఉంది.
నెక్స్ట్ కూడా బాలీవుడ్ స్టార్ హీరోలు రాజమౌళితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించిన అతని ఛాయస్ మాత్రం టాలీవుడ్ హీరోలే అయ్యే ఛాన్స్ ఉంది. ఒక వేళ చేస్తే ఆర్ఆర్ఆర్ లో అజయ్ దేవగన్ తరహాలో కీలక పాత్రలు గెస్ట్ అప్పీరియన్స్ ఉండే రోల్స్ చేసే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది. మరి బాలీవుడ్ స్టార్స్ తో అని జరుగుతున్న ప్రచారంలో వాస్తవమెంత అనేది తెలియాలంటే జక్కన్న స్పందించే వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











