For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆర్ఆర్ఆర్ రిలీజ్ కోసం జక్కన్న న్యూ ప్లాన్.. సాధ్యమయ్యే పనేనా?

  |

  మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యుంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారిగా కలిసి యాక్ట్ చేస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా రౌద్రం రణం రుధిరం (RRR). బాహుబలి దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీమ్ గా అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా హాలీవుడ్ సహా బాలీవుడ్ నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని టాలీవుడ్ బడా నిర్మాత దానయ్య ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తుండగా అజయ్ దేవగన్, శ్రియ శరన్, రాహుల్ రామకృష్ణ, సముద్రఖని తదితరులు ఇతర రోల్స్ చేస్తున్నారు.

  ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా నుండి రామ్ చరణ్ అల్లూరి టీజర్ తో పాటు ఎన్టీఆర్ భీమ్ టీజర్ ఇటీవల యూట్యూబ్ లో విడుదలై మంచి రెస్పాన్స్ ను అందుకుంది. అలానే కొద్దిరోజుల క్రితం ఐదు భాషల్లో విడుదలైన దోస్తీ సాంగ్ కూడా శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పటికే అందరిలో ఎన్నో భారీ అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమాని తప్పకుండా అన్ని వర్గాల ఆడియన్స్ ఆదరిస్తారని చిత్ర యూనిట్ నమ్ముతోంది.

  Ss rajamouli new plan for RRR release but its impossible,

  నిజానికి ఈ సినిమాని గత ఏడాది జులై 30న విడుదల చేస్తాం అంటూ యూనిట్ ప్రకటించింది, అయితే పలు కారణాల వలన ఆ డేట్ వాయిదా పడడం, ఆ తరువాత కరోనా కారణంగా షూట్ కొన్నాళ్ళు వాయిదా పడడంతో సినిమాని ఈ ఏడాది జనవరి 8కి పోస్ట్ పోన్ చేసారు. అనంతరం మరొక్కసారి కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ ఏడాది అక్టోబర్ 13కి వాయిదా పడ్డ ఈ మూవీ, లేటెస్ట్ గా మళ్ళి వాయిదా పడనున్నట్లు సమాచారం. ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం జక్కన్న టీమ్ ఈ సినిమాని సమ్మర్ కి విడుదల చేయాలని భావించిందట. అయితే బయ్యర్స్ అభ్యర్ధన మేరకు ఇంకా ముందే, అనగా మూవీని సంక్రాంతికి తీసుకువచ్చేందుకు సిద్ధం అయ్యారట ఆర్ఆర్ఆర్ మేకర్స్.

  అయితే ఇప్పటికే అదే సమయానికి మహేష్, పవన్, ప్రభాస్ ల సినిమాలు రిలీజ్ ని ప్రకటించి ఉండడంతో, ఆయా సినిమాల దర్శకనిర్మాతలని ఒప్పించే ప్రయత్నం చేసే అవకాశం కూడా ఉందట. ఆర్ఆర్ఆర్ టీమ్ అలానే రాజమౌళి యొక్క ప్రత్యేక అబ్యర్ధన మేరకు ఆ ముగ్గురు సినిమాల వారు ఆర్ఆర్ఆర్ కోసం తమ సినిమాలను వాయిదా వేసుకునేందుకు సిద్ధం చేసుకుంటారా అనేది పెద్ద సందేహం. అలానే మరికొద్దిరోజుల్లో ఈ విషయమై ఆర్ఆర్ఆర్ మూవీ కి సంబంధించి అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ కూడా రానుందని తెలుస్తోంది. మరి ఇదే కనుక జరిగితే మహేష్ సర్కారు వారి పాట, ప్రభాస్ రాధేశ్యామ్, పవన భీమ్లా నాయక్ సినిమాలు మరొక రెండు నెలలవరకు వాయిదా పడే ఛాన్స్ ఉందని అంటున్నారు విశ్లేషకులు.

  English summary
  Ss rajamouli new plan for RRR release but it's impossible,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X