దిమ్మతిరిగే కథతో రాజమౌళి.. హాట్ టాపిక్‌గా రాంచరణ్, ఎన్టీఆర్ పాత్రలు..
Recommended Video

బాహుబలి తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించే సినిమా ఏమిటి అనే ప్రశ్నకు తెరపడింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రాంచరణ్ కలయికతో మల్టీస్టారర్ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారనే వార్త మీడియాలో సంచలనం రేపుతున్నది. ఈ ముగ్గురు ఇటీవల కలిసి తీయించుకొన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

సాయిధరమ్ తేజ్ క్లారిటీ..
అధికారికంగా ఈ ముగ్గురి నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినా రాజమౌళి తీయబోయే సినిమా గురించి రకరలా వార్తలు విస్తృత ప్రచారంలో ఉన్నాయి. ఇటీవల జవాన్ ప్రమోషన్‌లో మాత్రం మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఈ వార్తకు కొంత క్లారిటీ ఇచ్చాడు. ఆ ముగ్గురి కాంబినేషన్‌లో సినిమా రాబోతున్నదని తేజ్ చెప్పేశాడు.

బాక్సింగ్ కథా నేపథ్యంగా
రాజమౌళి దర్శకత్వంలో, సెన్సేషనల్ కాంబినేషన్‌తో వచ్చే సినిమా గురించి వినిపిస్తున్న రకరకాల కథనాల ప్రకారం ఈ చిత్ర కథ బాక్సింగ్ నేపథ్యంతో తెరకెక్కుతోందనేది ప్రాథమిక సమాచారం.

బాక్సర్లుగా రాంచరణ్, ఎన్టీఆర్
రాజమౌళి రూపొందించే చిత్రంలో ఎన్టీయార్, చరణ్ అన్నదమ్ములుగా నటిస్తున్నారు అనేది తాజా వార్త. ఈ సినిమాలో వీరిద్దరూ బాక్సర్లుగా కనిపించనున్నారట. ఈ కథలో భావోద్వేగాలు ఆకట్టుకునే విధంగా ఉంటుందనేది టాక్

180 కోట్ల బడ్జెట్‌తో రాజమౌళి
బాహుబలి తర్వాత రాజమౌళి రూపొందించబోయే సినిమా బడ్జెట్ కూడా భారీగా ఉంటుందట. దాదాపు 180 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనున్నదనే వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతున్నది.

బాహుబలిని మించే విధంగా
బాహుబలి తర్వాత క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా కోసం ఎంత బడ్జెట్‌నైనా పెట్టడానికి నిర్మాత దానయ్య సిద్ధంగా ఉన్నారట. తెలుగుతోపాటు పలు ఇతర భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ప్లాన్‌తో ముందుకెళ్తున్నట్టు సమాచారం.

బాలీవుడ్‌లో మల్టీస్టారర్..
బాలీవుడ్‌లో రణ్‌వీర్, ప్రభాస్‌లతో తీయాలనే రాజమౌళి ప్రయత్నించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. కరణ్ జోహర్ ఆ సినిమాకు నిర్మాత అని ప్రచారం జరిగింది. ఆ చిత్రం ద్వారా ప్రభాస్‌ను బాలీవుడ్‌కు పరిచయం చేయాలని భావించారు. అయితే ఎందుకో సినిమా వెలుగు చూడలేదు. ఆ కథనే ఇప్పుడు చరణ్, ఎన్టీఆర్ తెరకెక్కించనున్నట్టు మరో వార్త ప్రచారంలోకి వచ్చింది.

విజేయేంద్రప్రసాద్ మెరుగులు
త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడనున్నట్టు తెలుస్తున్నది. నటీనటులు ఎంపిక తదితర విషయాలపై చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది. ఈ సినిమా కథకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడట.


Click it and Unblock the Notifications











