SS Rajamouli: పాత ఫార్ములాను వాడుతున్న జక్కన్న.. టెన్షన్‌లో మహేశ్ ఫ్యాన్స్
దర్శక ధీరుడు రాజమౌళి... ఈ పేరే ఓ బ్రాండ్ లాగా అయిపోయింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ ను హాలీవుడ్ స్థాయికి తీసుకువెళ్లారు జక్కన్న. ఇక జక్కన్న తన తదుపరి సినిమాను సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా కథ కూడా పూర్తి అయిందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం జక్కన్న తన పాత ఫార్ములాను ప్రయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న మహేశ్ బాబు ఫ్యాన్స్ తెగ ఆందోళన పడుతున్నారు. మళ్లీ మా హీరోను వదలవా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అసలు జక్కన్న ఫార్ములా ఏంటి.. మహేశ్ బాబు ఫ్యాన్స్ ఎందుకు టెన్షన్ పడుతున్నారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఒకప్పుడు తెలుగు సినిమాలు అంటే.. చులకనగా చూసేవారు. మహా అయితే సౌత్ వరకు క్రేజ్ ఉండేది. ఎప్పుడైతే రాజమౌళి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారో... ఆయన తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లారు అనడంలో సందేహం లేదు. బహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమా సత్తాను హాలీవుడ్ వరకు తెలియజేశారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఓ పాటకు ఆస్కార్ అవార్డు రావడం.. ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడేలా చేశారు రాజమౌళి.

జక్కన్న ప్రస్తుతం మహేశ్ బాబు సినిమా పనిలో నిమగ్నం అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేశ్ గుంటూరు కారం సినిమాతో బిజి బిజిగా ఉన్నారు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. అతడు, ఖలేజా సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా.. పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా అంటే జనవరి 12వ తేదీన రిలీజ్ కాబోతుంది.
ఇక గుంటూరు కారం సినిమా తర్వాత మహేశ్ బాబు.. రాజమౌళి సినిమాపై దృష్టి పెట్టనున్నారు. ఇక ఇప్పటికే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్టు కూడా కంప్లీట్ చేశారనే టాక్ వినిపిస్తుంది. అయితే ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అసలు విషయం ఏంటంటే.. రాజమౌళి మహేశ్ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కనుందట. ఈ సినిమాను రెండు భాగాలుగా రాజమౌళి తెరకెక్కించనున్నట్లు ఓ న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తుంది.

ఇప్పటికే ఈ సినిమా అడ్వంచర్ జోన్ లో ఉంటుందని చెప్పుకువచ్చారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో, ఇండియానా జోనస్ లాంటి బ్యాక్ డ్రాప్ తో హాలీవుడ్ రేంజులో ఉంటుందని వెల్లడించారు. అయితే ఈ కథను రెండు భాగాలుగా చేయనున్నారట. ఈ ఏడాది చివరి కల్లా ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అవుతాయని తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుందని సమాచారం. ఇక ఈ సినిమాకు రెండో పార్ట్ కూడా తెరకెక్కించాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే బహుబలి 1, బహుబలి 2 తీసిన జక్కన్న.. ఇప్పుడు మహేశ్ సినిమాను కూడా రెండు పార్ట్స్ అంటే మహేశ్ ఫ్యాన్స్ మాత్రం బయడపడుతున్నారు. దానికి కారణం.. జక్కన్న ఒక్క సినిమా తీసేందుకే 3 ఏళ్లు తీసుకుంటారు.. మరి మహేశ్ తో రెండు సినిమాలు అంటే.. ఎన్ని ఏళ్లు తీసుకుంటాడో అని తెగ ఆందోళన చెందుతున్నారట. ఇప్పట్లో మహేశ్ బాబును జక్కన్న వదలడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకో ఐదు ఆరేళ్లు మహేశ్ బాబు జక్కన్న ఆధీనంలోనే ఉండాలా అంటూ తెగ టెన్షన్ పడుతున్నారు. మరి జక్కన్న రెండు పార్ట్స్ తీస్తారనే విషయంలో క్లారిటీ లేదు. ఒకవేళ నిజం అయితే మాత్రం మహేశ్ బాబు ఇంకో ఐదు ఆరేళ్లు నిజంగానే జక్కన్నతో ట్రావెల్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











