»   » ప్రభాస్ కోసం రాజమౌళి కథ రెఢీ.. స్టోరీ ఏమిటంటే..

ప్రభాస్ కోసం రాజమౌళి కథ రెఢీ.. స్టోరీ ఏమిటంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి2 తర్వాత రాజమౌళి సినిమా ఏమిటనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్. అయితే తన తదుపరి సినిమాపై ఇంకా ఎలాంటి వివరణగానీ, ప్రకటనగానీ చేయలేదు. కానీ టాలీవుడ్ నిర్మాతకు ముందే కమిట్ అయినందున రాజమౌళి తెలుగు సినిమానే చేయడానికి అవకాశం ఉంది. ఇక ప్రభాస్‌ మాత్రం సాహోపై కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ కోసం రాజమౌళి కథ రెడీ చేశారని తాజాగా ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది.

 ప్రభాస్‌కు నచ్చేసిందట..

ప్రభాస్‌కు నచ్చేసిందట..

బాహుబలి షూటింగ్ సమయంలోనే ప్రభాస్‌కు రాజమౌళి ఓ కథను వినిపించారట. బాహుబలితో కథ గురించి, అందులో క్యారెక్టర్స్‌ గురించి డిస్కస్‌ కూడా చేశారట. బాహుబలికీ కథ బాగా నచ్చేసిందట!

'Baahubali' Prabhas and Rajamouli to team up for Another Project
కమిట్‌మెంట్స్ ప్రకారం..

కమిట్‌మెంట్స్ ప్రకారం..

అయితే ముందస్తు కమిట్‌మెంట్ ప్రకారం సినిమా స్టార్ట్‌ చేయడానికి వారికి అడ్డంకిగా మారింది. ముందుగా చేసుకొన్న ఒప్పందం ప్రకారం వారు సినిమాలకే అంకితమయ్యారు. ఆ కమిట్‌మెంట్స్‌ను కంప్లీట్‌ చేసిన తర్వాత ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట.

సాహో తర్వాతనే..

సాహో తర్వాతనే..

ప్రస్తుతం ప్రభాస్‌ సాహో చిత్రంలో నటిస్తున్నారు. ‘రన్‌ రాజా రన్‌' ఫేమ్‌ సుజీత్‌ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా పూర్తయ్యాక, నిర్మాత రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారు. ఈ రెండిటిని మహా అయితే ఏడాదిలో పూర్తి చేస్తారనే తాజా సమాచారం.

రాజమౌళి మరో సినిమాపై

రాజమౌళి మరో సినిమాపై

‘బాహుబలి-2' తర్వాత ఇంకా మరో సినిమా స్టార్ట్‌ చేయని రాజమౌళి ఈలోపు ఓ సినిమా చేయాలనుకుంటున్నారు. ఎవరి సినిమాలు వారు పూర్తి చేశాక... ఏడాది తర్వాత ‘బాహుబలి' టైమ్‌లో డిస్కస్‌ చేసిన కథతో ప్రభాస్, రాజమౌళి సినిమా చేస్తారట.

కథే ఏమిటంటే.

కథే ఏమిటంటే.

ఈసారి రాజమౌళి తయారు చేసిన కథ బాహుబలి మాదిరిగా రాజుల కథ కాదట. ప్రభాస్‌ కోసం పక్కా కమర్షియల్‌ కథను రెడీ చేశారట రాజమౌళి. అయితే ప్రభాస్, రాజమౌళి రేంజ్‌ను మరింత పెంచే విధంగా ఉంటుంది అనేది ఫిలింనగర్ సమాచారం.

English summary
Director SS Rajamouli is preparing a story for Prabhas. They discussed a point while Baahubali Shooting. Now that point developing for Prabhas. After Saaho, this project may go onto sets.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu