twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR‌లో ఎన్టీఆర్‌కు జంటగా హాట్ హీరోయిన్.. రాజమౌళి సీక్రెట్‌గా అమెరికాలో..

    |

    Recommended Video

    “RRR” Team Finally Finds A Heroine For Jr NTR || Filmibeat Telugu

    దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న RRR చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త తాజాగా వెలుగు చూసింది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ నటిస్తున్నట్టు ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అయితే రాజమౌళి గానీ, ఇతర చిత్ర యూనిట్ సభ్యులుగానీ ఈ వార్తపై ఎలాంటి ధృవీకరణ జరుపలేదు. ఎన్టీఆర్‌తో జతకట్టనున్న హీరోయిన్ ఎవరంటే..

     డైసీ ఎడ్గర్ జోన్స్ షాక్‌తో

    డైసీ ఎడ్గర్ జోన్స్ షాక్‌తో

    RRR సినిమా ప్రకటించినప్పుడు ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి, బ్రిటన్ యాక్టర్ డైసీ ఎడ్గర్ జోన్స్ నటిస్తున్నట్టు ప్రకటించారు. అయితే సినిమా సెట్స్‌పైకి వెళ్లి జోరుగా చిత్రీకరణ జరుపుకొంటున్న సమయంలో డైసీ షాకిచ్చారు. వ్యక్తిగత కారణాల వల్ల సినిమా నుంచి తప్పుకొంటున్నట్టు వివరణ ఇచ్చారు. దాంతో హీరోయిన్ వేటను రాజమౌళి మొదలుపెట్టారు.

    అమెరికాలో రాజమౌళి

    అమెరికాలో రాజమౌళి

    RRR సినిమా షూటింగ్‌‌ను రాజమౌళి మరోసారి వాయిదా వేసి అమెరికా వెళ్లడం అనేక అనుమానాలకు తావిచ్చింది. వ్యక్తిగత పనిమీద యూఎస్ వెళ్లున్నట్టు చెప్పినప్పటికీ, ఆయన RRR సినిమాలోని హీరోయిన్ ఎంపిక కోసం వెళ్లినట్టు చిత్ర యూనిట్‌కు సంబంధించిన వ్యక్తులు బయటపెట్టారు.

    ఎన్టీఆర్‌ జంటగా ఎమ్మా రాబర్ట్స్

    ఎన్టీఆర్‌ జంటగా ఎమ్మా రాబర్ట్స్

    ప్రస్తుతం RRR కోసం ఎమ్మా రాబర్ట్స్‌ను రంగంలోకి దించుతున్నట్టు, ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ ఆమెనంటూ ప్రకటన చేశారు. ఈ మేరకు ఎమ్మాతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. అంతేకాకుండా పాత్రకు సంబంధించిన లుక్ టెస్ట్ కూడా నిర్వహిస్తున్నట్టు సమాచారం. త్వరలోనే ఎమ్మా రాబర్ట్స్‌ను RRRలోకి తీసుకొంటున్నట్టు అధికారికంగా కూడా ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది.

     తదుపరి షెడ్యూల్‌లో ఆలియా, ఎమ్మా రాబర్ట్స్?

    తదుపరి షెడ్యూల్‌లో ఆలియా, ఎమ్మా రాబర్ట్స్?

    RRR సినిమాకు సంబంధించిన సన్నివేశాలను ఇటీవల హైదరాబాద్, ఆహ్మదాబాద్‌లో చిత్రీకరించారు. త్వరలో పూణేలో జరిగే షెడ్యూల్‌లో ఆలియాభట్ చేరనున్నారు. కిందటి వారం రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య జరిగే ఓ ఫైట్ సీన్‌ను సుమారు రూ.45 కోట్లతో చిత్రీకరించడం సెన్సేషన్‌గా మారింది. తదుపరి షెడ్యూల్‌లో తప్పనిసరిగా హీరోయిన్ల ఎంట్రీ అవసరం కనుకనే.. రాజమౌళి ప్రస్తుతం రెండో హీరోయిన్ ఎంపికపై కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది.

    English summary
    SS Rajamouli's RRR will be shot at real locations across the nation, unlike Baahubali which was shot at a grand set. The director's next, RRR will be produced by DVV Danayya having an enormous budget of nearly Rs 450 crore.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X