బడ్టెట్ బాంబు పేలింది.. వెనక్కి తగ్గిన రాజమౌళి!
స్పైడర్, అజ్ఞాతవాసి లాంటి చిత్రాలు టాలీవుడ్‌కు ఓ గుణపాఠంగా మారుతున్నాయి. భారీ బడ్జెట్ బుడుగలు పేలుతుండటంతో రెమ్యునరేషన్ దందాలు దారికొస్తున్నాయి. భారీ సినిమాల బడ్జెట్‌లో సగం హీరో, హీరోయిన్లు రెమ్యునరేషన్లు ఉండటం అనేది నిర్మాతకు భారంగా మారింది. స్పైడర్, అజ్ఞాతవాసి చిత్రాలు పరాజయాలు డిస్టిబ్యూటర్లను దారుణ పరిస్థితుల్లోకి నెట్టాయనే తెలిసిందే. ఇలాంటి పరిస్థుతుల్లో రాజమౌళి ఓ తెలివైన నిర్ణయం తీసుకొన్నట్టు ఓ వార్త ప్రచారం జరుగుతున్నది. అదేమిటంటే..

రాజమౌళి ప్లాన్ బీ సిద్ధం
బాహుబలి2 తర్వాత రాంచరణ్, ఎన్టీఆర్‌తో రాజమౌళి సినిమా ప్లాన్ చేశాడనేది విదితమే. అయితే ఆ చిత్రాన్ని రూ.100 కోట్లకుపైగా బడ్డెట్‌తో తెరకెక్కించనున్నారనే వార్త ప్రచారంలో ఉంది. ఇక రాజమౌళి ఆ వార్తలకు విరుద్దంగా ప్లాన్ బీ రెడీ చేసినట్టు సమాచారం.
Recommended Video


40 కోట్లతోనే సినిమా
ప్లాన్ బీ ప్రకారం 100 కోట్ల బడ్జెట్‌తో కాకుండా కేవలం రూ.40 కోట్లతోనే సినిమాను పూర్తి చేయడానికి జక్కన్న సిద్ధపడుతున్నారట. ఈ సినిమా నిర్మాణంలో స్టార్ల రెమ్యునరేషన్ ఉండదనేది ఆసక్తికరమైన అంశం.
మెగా, నందమూరి కాంబోలో నటీనటుల రెమ్యునేషన్లను ఏరియా వారీగా పర్సెంటేజ్ తీసుకోనే విధంగా రాజమౌళి ఓ స్కెచ్ వేశాడట. లాభాల నుంచి పర్సెంటేజ్‌ల వారీగా రెమ్యునరేషన్ అందుకొనే విధంగా ప్లాన్ రూపొందించినట్టు తెలుస్తున్నది.

బడ్జెట్‌పై భారం ఉండదు
రెమ్యునరేషన్లు లేకుండా సినిమా తీయడం వల్ల నిర్మాతపై ఎలాంటి భారం ఉండదు. ముందస్తు చెల్లింపుల గొడవ తగ్గుతుంది. పరిమితమైన బడ్జెట్‌లోనే సినీ నిర్మాణం పూర్తవుతుంది. ఖర్చును భారీగా తగ్గించే అవకాశం ఉంటుందనే మాట వినిపిస్తుంది.

ఏరియాల వారీగా రెమ్యునరేషన్
ఏరియాల వారీగా సినిమా బిజినెస్ నుంచి రెమ్యునేషన్ అందుకోవడవమో లేదా విడుదలైన తర్వాత ఏరియాల వారీగా షేర్ మొత్తం నుంచి తమ వాటాను తీసుకోవడం జరుగుతుందనేది తాజా ప్లాన్ ఉద్దేశం. ఇదే నిజమైతే టాలీవుడ్‌కు ఓ శుభపరిణామం ఎదురైనట్లే. ఎందుకంటే ఇటీవల భారీ బడ్జెట్ చిత్రాలు, అగ్రహీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్లాకొట్టిన విషయం తెలిసిందే.

2019లో వేసవిలో రిలీజ్
స్ట్పోర్ట్స్ కథా నేపథ్యంతో రూపొందే ఈ సినిమా అక్టోబర్ నుంచి సెట్స్‌పైకి వెళ్లనున్నది. మెగా, నందమూరి అభిమానుల అంచనాలకు అనుగుణంగా ఈ సినిమా రూపొందించే పనిలో ఉన్నారు రాజమౌళి. ఈ చిత్రం 2019 సమ్మర్‌లో రిలీజ్ అయ్యే విధంగా ప్రొడక్షన్‌ను ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











