RRR కోసం హీరోయిన్ వేట.. ఆ ఇద్దరు భామలపై రాజమౌళి కన్ను... బాలీవుడ్ బ్యూటీ దిగివచ్చేనా?

బాహుబలి మూవీ తర్వాత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం RRR. ఇటీవలే రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, డీవీవీ దానయ్య హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ చిత్ర యూనిట్‌ను పరిచయం చేశారు. రాంచరణ్ సరసన అలియాభట్, ఎన్టీఆర్ సరసన బ్రిటన్ భామ డైసీ ఎడ్గర్ జోన్స్ నటిస్తున్నట్టు తెలిపారు. అయితే డైసీ సినిమా నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమైంది.. వివారాల్లోకి వెళితే..

 బాంబుల్లాంటి వార్తలతో షూటింగ్ వాయిదా

బాంబుల్లాంటి వార్తలతో షూటింగ్ వాయిదా

అంత సవ్యంగా సాగుతూ ఉత్తరాదిలో షూటింగ్ ప్రారంభించగానే రెండు బాంబు లాంటి వార్తలు పేలాయి. ఒకటి రాంచరణ్ గాయాలపాటు కావడం, రెండోది సినిమా నుంచి డైసీ ఎడ్గర్ జోన్స్ తప్పుకోవడం జరిగింది. ప్రస్తుతం రాంచరణ్ గాయం కారణంగా పూణె షెడ్యూల్‌ను వాయిదా వేసినట్టు టీమ్ ప్రకటించింది.

డైసీ స్థానంలో ఆ ఇద్దరి గురించి

డైసీ స్థానంలో ఆ ఇద్దరి గురించి

ఇక డైసీ ఎడ్గర్ జోన్స్ తాను కుటుంబ పరిస్థితుల కారణంగా తప్పుకొంటున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే ప్రస్తుతం డైసీ స్థానంలో హీరోయిన్ ఎవరనే విషయం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం రాజమౌళి ఇద్దరు హీరోయిన్లపై దృష్టిపెట్టినట్టు తెలుస్తున్నది. వారిలో ఒకరు శ్రద్ధాకపూర్, మరొకరు జాహ్నవి కపూర్ అనే మాట వినిపిస్తున్నది.

శ్రద్ధాకపూర్‌పై రాజమౌళి నజర్

శ్రద్ధాకపూర్‌పై రాజమౌళి నజర్

ప్రస్తుతం శ్రద్ధాకపూర్ సాహో చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమా ద్వారా ఆమె టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే సాహోలో ఆమె పాత్ర గురించి బాగా చెప్పుకొంటున్నారు. దీంతో తెలుగు సినిమా వాతావరణంతో ఇప్పటికే పరిచయం ఉన్న కారణంగా శ్రద్దా కపూర్‌ను తీసుకొనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. డైసీ నిష్క్రమణ తర్వాత సాహో యూనిట్‌తో చర్చించినట్టు తెలుస్తున్నది.

జాహ్నవి కపూర్‌ గురించి ఆలోచన

జాహ్నవి కపూర్‌ గురించి ఆలోచన

ఇక దివంగత శ్రీదేవి జాహ్నవి కపూర్‌ కుటుంబానికి తెలుగు సినిమా పరిశ్రమతో మంచి సంబంధాలు ఉన్నాయి. దక్షిణాది చిత్రంలో నటింపజేసే విషయాన్ని ఆమె కుటుంబం పరిశీలిస్తున్నది. మంచి ప్రాజెక్ట్ లభిస్తే దక్షిణాదిలో అడుగుపెట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో జాహ్నవి కపూర్‌పై రాజమౌళి దృష్టిపెట్టినట్టు సమాచారం. అయితే అత్యంత భారీ ప్రాజెక్టు కావడం, ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెరకెక్కుతున్నందున జాహ్నవి నటించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

400 కోట్లతో భారీగా RRR

400 కోట్లతో భారీగా RRR

డీవీవీ ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య RRR చిత్రాన్ని రూ.400 కోట్ల వ్యయంతో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సముద్రఖని, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ తదితర నటులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమా జూలై 30వ తేదీ 2020లో విడుదల కానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X