»   » రజనీ, ఆమీర్, మోహన్‌లాల్‌తో రాజమౌళి సినిమా.. బడ్జెట్ 400 కోట్లు!

రజనీ, ఆమీర్, మోహన్‌లాల్‌తో రాజమౌళి సినిమా.. బడ్జెట్ 400 కోట్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకవైపు బాహుబలి: ది కన్‌క్లూజన్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంటూనే మరో భారీ ప్రాజెక్ట్‌పై సంచలన దర్శకుడు రాజమౌళి దృష్టిపెట్టినట్టు ప్రముఖ జాతీయ వెబ్‌సైట్లు కథనాలను వెల్లడిస్తున్నాయి. భారతీయ సినీ దిగ్గజాలు రజనీకాంత్, ఆమీర్‌ఖాన్, మోహన్‌లాల్‌తో మహాభారతాన్ని రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నది. ఈ వార్త ఇండియన్ సినీ పరిశ్రమలో సంచలనంగా మారింది.

ఒకే వెండితెరపై ముగ్గురు దిగ్జజాలు

ఒకే వెండితెరపై ముగ్గురు దిగ్జజాలు


ప్రాచీన పురాణం మహాభారత్‌ అంటే రాజమౌళికి ఎంతో మక్కువ. ఈ పురాణంలోని కొన్ని ఘట్టాలను స్ఫూర్తిగా తీసుకొని బాహుబలి రూపొందించినట్టు చెప్పుకొంటారు. భారీగా అభిమానులున్న ఆమీర్‌ఖాన్, రజనీకాంత్, మోహన్‌లాల్‌ను ఈ చిత్రంలో నటింపచేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. వీరు పోషించే పాత్రలను కూడా ఖారారు చేశారట. ఈ వార్త నిజమైతే ముగ్గురు లెజెండ్స్‌ను ఒకేసారి తెరపై చూసే భాగ్యం ప్రేక్షకులకు కలుగుతుంది.

భారీ ఫ్యాన్ ఫాలోయింగే కారణం

భారీ ఫ్యాన్ ఫాలోయింగే కారణం

ఆమీర్, రజనీ, మోహన్‌లాల్‌ను నటింప జేయడానికి వారికి ఉన్న ప్రేక్షకాదరణ ప్రధాన కారణమట. ఈ ముగ్గురిలో ఆమీర్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. మిస్టర్ ఫర్‌ఫెక్ట్‌ నటించిన చిత్రాలు భారతీయ సినిమా చరిత్రలోనే రికార్డు స్థాయి కలెక్షన్లను కొల్లగొట్టాయి. ఆమీర్‌కు తగ్గని ఫాలోయింగ్ రజనీకి కూడా ఉంది. దక్షిణాదిలో అన్ని రాష్ట్రాలతోపాటు బాలీవుడ్‌లోనూ తలైవర్‌కి మంచి హవా ఉంది. ఇక మలయాళ, తెలుగు, తమిళ పరిశ్రమలో మోహన్‌లాల్‌కు మంచి ఆదరణ ఉంది.

 400 కోట్ల బడ్జెట్‌తో భారతం

400 కోట్ల బడ్జెట్‌తో భారతం


మహాభారతాన్ని రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించే ప్రణాళికను రాజమౌళి సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తున్నది. భారతీయ సినీ పరిశ్రమలో అగ్ర నటులతో ఈ చిత్రాన్ని రూపొందించేందుకు కార్యాచరణ రూపొందించినట్టు సమాచారం. దీంతో దేశవ్యాప్తంగా ఈ చిత్రానికి సూపర్ క్రేజ్ వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రాజమౌళికి బాహుబలి బిగినింగ్‌తో మంచి పేరు, గుర్తింపు లభించింది. ఇది కూడా ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ కానున్నది.

 రాజమౌళికి బిగ్ ఫ్యాన్‌ను.. ఆమీర్

రాజమౌళికి బిగ్ ఫ్యాన్‌ను.. ఆమీర్


బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్‌ఖాన్ ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో నటించాలని ఉన్నదని ఓ కోరికను బయటపెట్టిన విషయం తెలిసిందే. దంగల్ ప్రమోషన్ సందర్భంగా హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రాజమౌళికి తాను పెద్ద ఫ్యాన్ అని చెప్పారు. మహాభారత్ చిత్రాన్ని తీస్తే కృష్ణ భగవానుడు లేదా కర్ణుడి పాత్రను పోషించాలని ఉందని వెల్లడించారు.

 ఏప్రిల్ 28న బాహుబలి2

ఏప్రిల్ 28న బాహుబలి2


అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న బహుబలి2 చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకొంటున్నది. ఏప్రిల్ 28 తేదీన విడుదల చేసేందుకు ముహుర్తం నిర్ణయించారు. బహుబలిని కట్టప్ప ఎందుకు చంపారన్న విషయం ఇప్పటికే పాపులర్ కావడంతో ఆ అంశంపై ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. దాంతో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు.

English summary
Filmmaker SS Rajamouli likely to made a movie with three legendary actors of Indian cinema Aamir Khan, Rajinikanth and Mohanlal
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu