twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి క్రేజ్ అంటే అది... రికార్డుస్థాయిలో RRR బిజినెస్!

    |

    బాహుబలి లాంటి అత్యంత ప్రజాదరణ పొందిన సినిమా తర్వాత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న RRR సినిమా కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లిన రోజు నుంచే అనేక సెన్సేషనల్ విషయాలతో నిత్యం ఈ సినిమా వార్తల్లో నిలుస్తున్నది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌కు సంబంధించిన సమాచారం దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. ఇంతకు ఈ సినిమా ఏ రేంజ్‌లో బిజినెస్ జరిగిందంటే..

    రూ.400 కోట్ల బడ్జెట్‌తో

    రూ.400 కోట్ల బడ్జెట్‌తో

    RRR చిత్రం సుమారు రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్నది. ఎన్టీఆర్, రాంచరణ్ కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియాభట్ దక్షిణాది పరిశ్రమకు పరిచయం అవుతున్నది. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న ఈ చిత్రాన్ని భారీ మొత్తం చెల్లించి ఓవర్సీస్ రైట్స్‌ ఫార్స్ ఫిల్మ్స్ దక్కించుకొన్నట్టు సమాచారం.

    రూ.70 కోట్లు చెల్లించి

    రూ.70 కోట్లు చెల్లించి

    ప్రస్తుతం RRR చిత్రం రెండో షెడ్యూల్‌లో ఉండగానే దాదాపు రూ.70 కోట్లు చెల్లించి ఓవర్సీస్ హక్కులను సొంతం చేసుకోవడం టాలీవుడ్‌లో సెన్సేషనల్‌గా మారింది. దక్షిణాది సినిమా విషయంలో ఓవర్సీస్ హక్కులకు సంబంధించి దేశవ్యాప్తంగా ఇదే రికార్డు అనే మాట వినిపిస్తున్నది. అయితే ఈ సినిమా ఏ రేంజ్‌లో వసూళ్లు రాబడుతుందోననే విషయం ఆసక్తిగా మారింది. బిజినెస్ విషయంలో రాజమౌళి గట్టిగానే కొట్టేశాడనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నది.

    చారిత్రాత్మక కథతో మూవీ

    చారిత్రాత్మక కథతో మూవీ

    తెలుగు రాష్ట్రాల్లోని ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధుల కథా నేపథ్యంతో RRR సినిమా తెరకెక్కుతున్నది. అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. బ్రిటీష్ పాలనలో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకొని ఫిక్షనల్‌గా ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. అద్భుతమైన స్క్రీన్ ప్లే, విజువల్ పరంగా కనికట్టు చేసే సన్నివేశాలతో సినిమాను దృశ్యకావ్యంగా అందించబోతున్నారనే మాట వినిపిస్తున్నది.

    నాలుగు భాషల్లో RRR

    నాలుగు భాషల్లో RRR

    RRR సినిమా చారిత్రాత్మక నేపథ్యం ఉన్న యాక్షన్ సినిమాగా రూపొందున్నది.తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాను 2020 జూలై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశారు. శరవేగంగా సాగుతున్న షూటింగ్‌కు ఎన్టీఆర్, రాంచరణ్‌ గాయాల కారణంగా RRR చిత్ర షూటింగ్‌లో కొంత జాప్యం జరిగింది.

    English summary
    SS Rajamouli's RRR will be shot at real locations across the nation, unlike Baahubali which was shot at a grand set. The director's next, RRR will be produced by DVV Danayya having an enormous budget of nearly Rs 400 crore. This movie overseas theatrical rights with a whopping amount of Rs 70 Crores.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X