అలా అయితే కష్టం.. ఎన్టీఆర్, రాంచరణ్‌కు రాజమౌళి మందలింపు.. ఫ్యాన్స్‌కు చేదువార్తే..
Recommended Video

బాహుబలి తర్వాత దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తదుపరి చిత్రం జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్‌తో మల్టీస్టారర్ సినిమాను రూపొందిస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించనున్నట్టు తెలిసిందే. అయితే ఈ మల్టీస్టారర్ సినిమాపై అనేక ఊహాగానాలు వస్తున్న అధికారికంగా నిర్మాత దానయ్య, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే సినిమాపై త్వరలో ప్రకటన చేయనున్నారనే ఫిలింనగర్ సమాచారం.

సంక్రాంతి రోజున అధికారిక ప్రకటన
యంగటైగర్ , చెర్రీతో సినిమాను సంక్రాంత్రి రోజున అధికారికంగా ప్రకటించాలని ప్లాన్‌లో జక్కన్న ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ సినిమాకు సంబంధించిన కథపై పూర్తి క్లారిటీ వచ్చేసిందటనే తాజా సమాచారం.

రాజమౌళి గ్రీన్ సిగ్నల్
కథ సంతృప్తిగా రావడంతో తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు రాజమౌళి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. దాంతో ఆయన స్క్రిప్టుపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. భావోద్వేగాలు కలిసి ఉన్న స్క్రిప్టును సిద్దం చేస్తున్నట్టు తెలుస్తున్నది.

సమతూకంతో జక్కన్న
నందమూరి ఫ్యాన్స్, మెగా అభిమానుల ఏ రకంగానూ చిన్నబుచ్చుకోకుండా, పాత్రల విషయంలో భేదాభిప్రాయాలు లేకుండా సమతూకంలో స్క్రిప్టు ఉండేలా క్రియేటివ్ డిపార్ట్‌మెంట్ చర్యలు తీసుకొంటున్నారట.

చెర్రీ, ఎన్టీఆర్‌కు డెడ్‌లైన్
ఇక చెర్రి, ఎన్టీఆర్‌లకు రాజమౌళి స్పష్టమైన డెడ్‌లైన్ విధించినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం రాంచరణ్ నటిస్తున్న చిత్రం రంగస్థలం. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి నటించే సైరా నర్సింహరెడ్డి చిత్ర నిర్మాణంలో కూడా బిజీగా ఉన్నారు.

అక్టోబర్‌లోపు ఫినిష్ కావాలి
ఇక రంగస్థలం చిత్రం తర్వాత బోయపాటి దర్శకత్వంలో రాంచరణ్ ఓ చిత్రాన్ని నటించనున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ లోపు పూర్తి చేసుకోవాలని రాజమౌళి డెడ్‌లైన్ విధించారట.

త్రివిక్రమ్ సినిమా త్వరగా ముగించాలి
జై లవకుశ తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఎన్టీఆర్ ఓ చిత్రాన్ని చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ముహుర్తం షాట్ ఓపెనింగ్ కూడా పూర్తయింది. త్రివిక్రమ్ సినిమాను అక్టోబర్‌లో పూర్తి చేసుకోవాలని కండిషన్ విధించినట్టు తెలుస్తున్నది.

కేవలం మల్టీస్టారర్‌పైనే
అక్టోబర్ నుంచి కేవలం మల్టీస్టారర్‌పైనే దృష్టిపెట్టాలని చెర్రీ, ఎన్టీఆర్‌కు రాజమౌళి సూచించినట్టు తెలుస్తున్నది. బాక్సింగ్ కథా నేపథ్యంలో సాగే ఈ చిత్రం కోసం మానసికంగా కూడా సిద్దం కావాలని, అందుకనుగుణంగా శారీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలని వారిద్దరికి చెప్పినట్టు ఫిలింనగర్లో ఓ వార్త చక్కర్లు కొడుతున్నది.

2019లో రాజమౌళి సినిమా
రాజమౌళి ప్రారంభించబోయే సినిమా దాదాపు 10 నెలల పాటు నిర్విరామంగా జరుగుతుందట. అంటే అక్టోబర్ నుంచి షూటింగ్ ప్రారంభమై 2019 ఆగస్టులో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అంటే రాజమౌళి మల్టీస్టారర్ చిత్రం 2018లో కూడా వెలుగు చూసే అవకాశం లేకపోవడం ఫ్యాన్స్‌కు చేదువార్తే అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











