twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR కోసం రాజమౌళి స్పెషల్ ప్లాన్.. రంగంలోకి టాలీవుడ్ అగ్ర హీరోలు.. ఇది నిజమైతే రచ్చ రచ్చే!

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలోని రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. అలాగే స్టార్ హీరోల మధ్యలో ఉండే స్నేహాలు కూడా మరింత దగ్గరవుతున్నాయి. గతంలో మాదిరిగా కాకుండా నేటితరం యువ హీరోలు చాలా ఫ్రెండ్లిగా ఉంటున్నారు. ఇక రాజమౌళి లాంటి దర్శకులు మన హీరోలతోనే పాన్ ఇండియా మార్కెట్ ను అమాంతంగా పెంచేస్తుండడం విశేషం. ఇక RRR సినిమా కోసం జక్కన్న అగ్ర హీరోలతో ఒక ప్లాన్ సెట్ చేసినట్లు తెలుస్తోంది.

    స్థాయి ఎంత పెరిగినా కూడా

    స్థాయి ఎంత పెరిగినా కూడా

    దర్శకుడు ఎస్ఎస్. రాజమౌళితో సినిమా చేయాలని దేశంలోని టాప్ స్టార్ హీరోలు సైతం సిద్ధంగా ఉన్నారు. హీరోయిన్స్ అయితే డేట్స్ అడగడమే ఆలస్యం అనేస్తున్నారు. అయితే జక్కన్న స్థాయి ఎంత పెరిగినా కూడా పాన్ ఇండియా సినిమాలను మన హీరోలతోనే చేస్తుండడం విశేషం. టాలీవుడ్ మార్కెట్ పెరగడానికి ఆయన చేస్తున్న ప్రాజెక్టులు ఎంతగానో హెల్ప్ అవుతున్నాయి.

    డీల్ చేయడం.. అంత సాదారణమైన విషయం కాదు

    డీల్ చేయడం.. అంత సాదారణమైన విషయం కాదు

    ఇక అగ్ర హీరోలు కలిసి ఒక యాక్షన్ సినిమాలో నటిస్తే చూడాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అభిమానులకు RRR మంచి కిక్కిస్తుందని చెప్పవచ్చు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా జూనియర్ ఎన్టీఆర్ కొమరం బీమ్ గా అలరించబోతున్నారు. ఈ స్టార్ ను డీల్ చేయడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. కానీ జక్కన్న ఆ రిస్క్ తో చాలా ఈజీగా సక్సెస్ కొట్టబోతున్నాడని చెప్పవచ్చు.

    RRR ప్రమోషన్ లో మిగతా స్టార్స్ కూడా

    RRR ప్రమోషన్ లో మిగతా స్టార్స్ కూడా

    ఇక ఎలాంటి సినిమా చేసినా కూడా ప్రమోషన్ విషయంలో జక్కన్న అంచనాలకు తగ్గట్లుగానే చేస్తాడనేది అందరికి తెలిసిందే. RRR సినిమా కేవలం మెగా, నందమూరి అభిమానులు మాత్రమే కాకుండా మిగతా స్టార్ హీరోల ఫ్యాన్స్ కూడా తమ సినిమా అని ఫీల్ అయ్యేలా చేయాలని జక్కన్న టార్గెట్ సెట్ చేసుకుంటున్నాడు. ఇప్పటివరకు జక్కన్న వర్క్ చేసిన హీరోలందరిని RRR ప్రమోషన్ లో మిక్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.

    RRR ప్రమోషనల్ సాంగ్

    RRR ప్రమోషనల్ సాంగ్

    ప్రభాస్ దగ్గరి నుంచి నాని, సునీల్, వరకు అందరూ కూడా రాజమౌళి కోసం RRR ప్రమోషనల్ సాంగ్ లో కనిపిస్తారని సమాచారం. జక్కన్న పిలిస్తే మిగతా హీరోలు కూడా ఆ సాంగ్ లో కనిపించడానికి ఏ మాత్రం అభ్యంతరం చెప్పరు. ప్రస్తుతం ఈ న్యూస్ అయితే ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అఫీషియల్ గా క్లారిటీ వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే.

    English summary
    Pan India Big Budget Movie RRR The real buzz has started. Speculations on this visual wonder directed by Rajamouli have already skyrocketed. And the Roar of RRR making video released today also raised the dose of expectations even further.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X