SSMB29: అడ్వెంచర్ ఫిల్మ్‌కు జక్కన్న చెక్... మహేశ్ మూవీపై రాజమౌళి యూటర్న్

తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్‌పై ప్రత్యేకమైన ఫోకస్ ఉంటుంది. ఫలానా హీరో, ఫలానా దర్శకుడు కలిసి పని చేయాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు. అలా టాలీవుడ్‌లో చాలా కాలంగా హాట్ టాపిక్ అవుతోన్న కాంబినేషన్లలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కలయిక ఒకటి. వీళ్లిద్దరూ కలిసి సినిమా చేయాలని చాలా కాలంగా అభిమానుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. కానీ, ఎందుకనో ఇప్పటి వరకూ కలిసి పని చేయలేదు ఇలాంటి పరిస్థితుల్లో మరికొన్ని రోజుల్లోనే మహేశ్, రాజమౌళి కలవబోతున్నారు. ఈ నేపథ్యంలో వీళ్ల కలయికలో వచ్చే సినిమా గురించి ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా దీని నుంచి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

Recommended Video

Mahesh Babu Ss Rajamouli Movie Genre Revealed | బాబు ఫ్యాన్స్ గెట్ రెడీ..!! || Filmibeat Telugu
మహేశ్ బిజీగా.. రాజమౌళి ఇలా

మహేశ్ బిజీగా.. రాజమౌళి ఇలా

వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో ఉన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ జోష్‌తోనే ఇప్పుడు అతడు పరశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. ఇక, రాజమౌళి ఇటీవలే RRRతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రం చాలా గ్యాప్ తర్వాత విడుదల కావడంతో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు.

 తొలిసారి కలవబోతున్న స్టార్లు

తొలిసారి కలవబోతున్న స్టార్లు


తెలుగు సినిమా స్థాయిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకుడిగా ఎస్ఎస్ రాజమౌళి పేరొందాడు. ఈయనతో ఒక్క సినిమా అయినా చేయాలని స్టార్ హీరోలందరూ కోరుకుంటుంటారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ స్టార్ డైరెక్టర్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా చేయబోతున్నాడు. దీన్ని కేఎల్ నారాయణ నిర్మించబోతున్నారు. ఈ విషయాన్ని అటు హీరో, ఇటు డైరెక్టర్ ప్రకటించేశారు.

మొదలయ్యేది ఇప్పుడు కాదు

మొదలయ్యేది ఇప్పుడు కాదు


వాస్తవానికి మహేశ్ బాబు.. ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా గత ఏడాది చివర్లోనే మొదలవుతుందని అంతా అనుకున్నారు. కానీ, కరోనా కారణంగా RRR వాయిదా పడడంతో ఈ ప్రాజెక్టు కూడా ఆలస్యం అయింది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు కూడా త్రివిక్రమ్‌తో సినిమాను చేస్తున్నాడు. అంటే అది పూర్తయ్యాకే అంటే వచ్చే ఏడాది ఇది మొదలయ్యే చాన్స్ ఉంది.

రాజమౌళి తండ్రి చేతిలో స్టోరీ

రాజమౌళి తండ్రి చేతిలో స్టోరీ


మహేశ్ బాబు - రాజమౌళిది క్రేజీ కాంబినేషన్ కావడంతో వీళ్ల నుంచి వచ్చే సినిమాపై ముందు నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ మూవీ స్టోరీపి తయారు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఈ ప్రాజెక్టు స్క్రిప్ట్ బాధ్యతను ఇప్పటికే తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు అప్పగించాడు జక్కన్న. ఈ విషయాన్ని ఆయన వెల్లడించాడు.

సినిమా నేపథ్యం ఇదేనంటూ

సినిమా నేపథ్యం ఇదేనంటూ


సూపర్ స్టార్ల కలయికలో రాబోయే ఈ ప్రాజెక్టు గురించి చాలా రోజులుగా ఎన్నో వార్తలు వైరల్ అవుతోన్నాయి. మరీ ముఖ్యంగా ఈ మూవీ స్టోరీ ఇదేనంటూ ఇప్పటికే కొన్ని లైన్లు తెరపైకి వచ్చాయి. ఇది సైన్స్ ఫిక్షన్ నేపథ్యం ఉన్న కథతో రూపొందనుందని కొందరు అంటే.. ఫారెస్ట్ బ్యాగ్‌డ్రాప్‌తో అడ్వెంచర్ లైన్‌తో రానుందని ఇటీవలే రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా పేర్కొన్నారు.

అడ్వెంచర్‌కు రాజమౌళి చెక్

అడ్వెంచర్‌కు రాజమౌళి చెక్

మహేశ్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కించే సినిమా ఫారెస్ట్ బ్యాగ్‌డ్రాప్‌తోనే వస్తుందని.. ఇందుకోసం చిత్ర యూనిట్ ఆఫ్రికాలో షూటింగ్ చేయబోతుందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ఈ కథ వల్లే మహేశ్ పుష్ప మూవీని చేయలేదని కూడా అన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా అడ్వెంచర్ జోనర్‌లో రావడం లేదని ఓ న్యూస్ బయటకు వచ్చేసింది.

అలా జక్కన్న మహేశ్ మూవీ

అలా జక్కన్న మహేశ్ మూవీ


రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు చేయబోయే సినిమాకు సంబంధించి తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. ఇది స్పై థ్రిల్లర్ జోనర్‌లో రాబోతుందట. ఈ మేరకు జక్కన్న తన తండ్రితో కథ రెడీ చేయమని కూడా చెప్పాడట. విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే కొన్ని లైన్లు వినిపించాడని.. అందులో రాజమౌళి కొన్ని సెలెక్ట్ చేశాడని కూడా ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X