SS Rajamouli: మహేశ్ బాబు కోసం ఇండోనేషియా భామా.. ఇదెక్కడి రచ్చ జక్కన్నా?
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఓ సినిమా రానుందనే విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా స్టార్ట్ కాకముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా గురించి రోజుకో గాసిప్ బయటకు వస్తుంది. తాజాగా ఈ సినిమాలో ఇండోనేషియ నటిని రాజమౌళి సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఒలివియా పాపను పెట్టి హైలెట్ చేసిన రాజమౌళి.. ఇప్పుడు తన నెక్ట్స్ మూవీ కోసం ఇండో పాపను పట్టినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తెలుగు సినిమా స్థాయిని హాలీవుడ్ స్థాయికి తీసుకువెళ్లింది మాత్రం రాజమౌళి అని చెప్పకతప్పదు. ఆయన బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమా మార్కెట్ ని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లారనడంలో సందేహం లేదు. ఇప్పుడు మహేష్ బాబుతో కలిసి అంతర్జాతీయ యాత్ర చేయబోతున్నారనే సంగతి తెలిసిందే. ఆ క్రమంలో నటీనటుల ఎంపిక సైతం టాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు చేరుకుంటుంది.

నార్త్ నుంచి హీరోయిన్స్ తెచ్చుకునే తెలుగు సినిమా ఇప్పుడు ఇతర దేశాల నుంచి కూడా హీరోయిన్స్ ని దిగుమతి చేసుకునే స్థాయికి వెళ్లింది. మహేశ్ తన కెరియర్లో 29వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో టాలీవుడ్ నుంచి హాలీవుడ్ నటులు నటించనున్నారు. ఇక ఈ సినిమా కోసం ఓ ఇండోనేషియన్ హీరోయిన్ ని ఎంచుకొన్నారని వార్తలు బయటకు వచ్చాయి. ఆమె ఎవరో కాదు... చెల్సియా ఇస్లాన్. ఇప్పటికే ఆమె కొన్ని హాలీవుడ్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.
ఇటీవల రాజమౌళి ఆమెకు స్క్రీన్ టెస్ట్ కూడా చేశారంట. ఇక మహేశ్ బాబు రాజమౌళి సినిమాలో ఆమె వర్క్ చేయటం కన్ఫర్మ్ అని సమాచారం. అయితే చెల్సియాని హీరోయిన్ పాత్ర కోసం ఎంచుకొన్నారా? లేదంటే కీలక పాత్ర కోసం తీసుకొన్నారా? అనే విషయం తెలియాల్సి ఉంది. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో ఎప్పుడో సినిమా రావాల్సి ఉండగా... 'బాహుబలి', 'ఆర్‌ఆర్‌ఆర్' వంటి భారీ ప్రాజెక్టుల వల్ల ఆలస్యమయిందని తెలుస్తోంది.

ఇక మహేశ్ గుంటూరు కారం కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక మహేశ్ బాబు రాజమౌళి సినిమాకు రూట్ క్లియర్ అయింది. మరికొద్ది రోజుల్లోనే రాజమౌళి ప్రపంచంలోకి అడుగుపెడతారు సూపర్ స్టార్. ఈ కాంబినేషన్‌లో వస్తున్న మూవీపై చాలా అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ చిత్రం కోసం 1200 కోట్ల బడ్జెట్ ని కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఓ తెలుగు హీరో నటించే సినిమాకు అంత పెట్టడం రికార్డు అని చెప్పవచ్చు.
ఇక ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 2024లో ప్రారంభమవుతుంది. ఇక ఈ సినిమాలో ఇండోనేషియా భామ చెల్సియా ఇస్లాన్ నటిస్తున్నారంటూ వార్తలు రావడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఒలివియాను తీసుకవచ్చిన రాజమౌళి.. ఇప్పుడు ఇండోనేషియా పాపను పట్టారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో నిధి వేట ఇతివృత్తంగా ఒక కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. జేమ్స్‌బాండ్ తరహాలో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా దీన్ని తీర్చిదిద్దే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయని సమాచారం.


Click it and Unblock the Notifications











