For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టాక్ ఆఫ్ ది టౌన్: RRR తర్వాత రాజమౌళి మరో మల్టీస్టారర్.. ఈ సారి ఆ ఇద్దరు హీరోలతో సినిమా.!

  By Manoj Kumar P
  |

  కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతూ తెలుగు సినీ ఇండస్ట్రీలోనే టాప్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. కెరీర్ ఆరంభం నుంచి ఆయన చేసిన సినిమాలన్నీ విజయవంతం అవడంతో పాటు వాటిలో చాలా వరకు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. ఇక, 'బాహుబలి' సిరీస్‌తో జక్కన్న తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాడు. తాజాగా ఆయన RRR అనే భారీ మూవీ చేస్తున్నారు. దీని తర్వాత రాజమౌళి చేయబోయే సినిమా గురించి ఓ సెన్సేషనల్ న్యూస్ లీక్ అయింది. ఆ షాకింగ్ వివరాలు మీకోసం..!

  బాహుబలితో వాళ్లందరికీ క్రేజ్ వచ్చింది

  బాహుబలితో వాళ్లందరికీ క్రేజ్ వచ్చింది

  దర్శకధీరుడు రాజమౌళి కొన్నేళ్ల క్రితం తెరకెక్కించిన సినిమా ‘బాహుబలి'. ప్రభాస్, అనుష్క, రానా, రమ్యకృష్ణ, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమాతో ప్రభాస్, రానాతో పాటు రాజమౌళికి దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అందుకే వీళ్ల సినిమాలకు క్రేజ్ ఏర్పడుతోంది.

  ఇద్దరు హీరోలను కలిపిన రాజమౌళి

  ఇద్దరు హీరోలను కలిపిన రాజమౌళి

  ‘బాహుబలి' వంటి భారీ విజయాన్ని అందుకున్న తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రమే ‘RRR'. స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ మల్టీ స్టారర్ మూవీని పిరియాడిక్ జోనర్‌లో తెరకెక్కిస్తున్నాడు. పోరాట యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ జీవిత కథలకు కొన్ని ఊహాజనిత సన్నివేశాలు జోడించి రూపొందిస్తున్నాడు జక్కన్న.

   పది భాషలు.. రాజమౌళి అదిరిపోయే ప్లాన్

  పది భాషలు.. రాజమౌళి అదిరిపోయే ప్లాన్

  డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని భారతదేశంలోని తొమ్మిది భాషలతో పాటు ఇంగ్లీష్‌లోనూ రూపొందిస్తున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అందుకే టాలీవుడ్, బాలీవుడ్ సహా హాలీవుడ్ నటులను సైతం ఈ సినిమాకు తీసుకున్నాడని అంటున్నారు. అంతేకాదు, లాభాలు ఆర్జించడానికి ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నారని సమాచారం.

  RRR తర్వాత రాజమౌళి మరో మల్టీస్టారర్

  RRR తర్వాత రాజమౌళి మరో మల్టీస్టారర్

  RRR తర్వాత రాజమౌళి చేయబోయే సినిమా గురించి తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఆయన తన తర్వాతి ప్రాజెక్టును సైతం మల్టీస్టారర్ మూవీగానే తెరకెక్కిస్తాడట. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కలిసి నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇది కూడా పిరియాడిక్ జోనర్‌లోనే తెరకెక్కుతోందనే టాక్ వినిపిస్తోంది.

   ఆ ఇద్దరు హీరోలతోనే ఎందుకు చేస్తున్నాడంటే..

  ఆ ఇద్దరు హీరోలతోనే ఎందుకు చేస్తున్నాడంటే..

  మహేశ్ బాబు, ప్రభాస్‌తో రాజమౌళి సినిమా చేస్తున్నాడన్న వార్త బయటకు వచ్చిన క్రమంలోనే అసలు వాళ్లిద్దరితోనూ ఈ ప్రాజెక్టు ఎందుకు అనుకుంటున్నాడో అన్న అంశం కూడా తెరపైకి వచ్చింది. దీని ప్రకారం.. రాజమౌళి.. ప్రభాస్, మహేశ్‌తో సినిమాలు చేయాల్సి ఉందట. ఇద్దరితో రెండు మూవీలు చేయడం కంటే మల్టీస్టారర్ బెటర్ అని నిర్ణయించుకున్నాడని టాక్.

  Ram Charan & Jr NTR Special Pic With Ajay Devgn | RRR | SS Rajamouli | Filmibeat Telugu
  బడా ప్రొడ్యూసర్ ప్లాన్.. ఇద్దరూ గ్రీన్ సిగ్నల్

  బడా ప్రొడ్యూసర్ ప్లాన్.. ఇద్దరూ గ్రీన్ సిగ్నల్

  రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను ‘బాహుబలి' ప్రొడ్యూసర్లలో ఒకరైన శోభు యార్లగడ్డ నిర్మిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఇద్దరు స్టార్ హీరోల నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకున్న ఆయన.. వాళ్లిద్దరికీ అడ్వాన్స్ కూడా ఇచ్చేశారని అంటున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది.

  English summary
  Prabhas and Rajamouli about starting a production house that could give chance to young filmmakers to come up with content-based flicks. They have now come to a conclusion to start their production house very soon.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X