భార్య తెలివిని కొత్తగా వాడుకుంటున్న రాజమౌళి.. అంతా RRR కోసమే..

దర్శకుడు రాజమౌళి ఒక సినిమాని ఎనౌన్స్ చేశాడు అంటే ఆ సినిమాకు ఎవరెవరు పని చేస్తారు అనేది ముందే ఊహించవచ్చు. దాదాపు ఆయన కుటుంబ సభ్యులే వెండితెర వెనుక సినిమా కోసం ఎంతగానో కష్టపడతారు. వారు చేసే పనిలో ఒక హార్డ్ అండ్ స్మార్ట్ వర్క్ ఉంటుందని ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెబుతారు. ఇక రాజమౌళి యూనిట్ లో ఎవరు మారినా కూడా కాస్ట్యూమ్, మ్యూజిక్ విషయంలో పెద్దగా మార్పులు ఉండవని అందరికి తెలిసిందే.

మ్యూజిక్ అన్నయ్య కీరవాణి అందిస్తే..కాస్ట్యూమ్ డిజైనర్ గా రాజమౌళి భార్య రమా వర్క్ చేయడం కామన్. వారు కేవలం ఆ వర్క్ అనే కాకుండా అప్పుడప్పుడు స్క్రిప్ట్ విషయంలో కూడా జక్కన్నకు సలహాలు అందిస్తూ ఉంటారట. అయితే ఈ సారి తన భార్య తెలివిని రాజమౌళి చాలా కొత్తగా వాడుతున్నాడట. RRR లో ఒక ఎపిసోడ్ కోసం పూర్తిగా రమా చేత డైలాగ్స్ రాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సాయి మాధవ్ బుర్ర మాటలు అందిస్తున్న విషయం తెలిసిందే.

ss rajamouli wife rama turned writer for the rrr

ఇక కథను విజయేంద్ర ప్రసాద్ అందించారు. అయితే ఒక ఎపిసోడ్ విషయంలో సంతృప్తి చెందని జక్కన్న రమా సలహాలు తీసుకున్నారట. ఆమె చెప్పిన విధానం నచ్చడంతో వెంటనే తననే డైలాగ్స్ రాయమని చెప్పినట్లు టాక్ వస్తోంది. లాక్ డౌన్ లో RRR సినిమా స్థాయిని మరింత పెంచేలా జక్కన్న ఫ్యామిలీ మొత్తం మరింత ససిద్ధంగా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా షూటింగ్ దాదాపు 70శాతం పూర్తయిందని గత ఇంటర్వ్యూలో చెప్పిన రాజమౌళి కరోనా వైరస్ తీవ్రత తగ్గిన తరువాత వీలైనంత త్వరగా మిగతా షూటింగ్ ని పూర్తి చేయాలని అనుకుంటున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X