Varansi: వారణాసికి రాజమౌళి రికార్డు రెమ్యూనరేషన్.. ఎన్ని కోట్ల పారితోషికం అంటే?
Varanasi: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు - దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్-వరల్డ్ మూవీ వారణాసి (Varanasi). ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. టైటిల్ గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సోషల్ మీడియాలో ప్రతి చిన్న అప్‌డేట్ వైరల్ అవుతుండగా, అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా ఈ ప్రాజెక్ట్‌ను కళ్లప్పగించి గమనిస్తున్నాయి. ఇండస్ట్రీ సెలబ్రిటీలు సైతం 'వారణాసి' విశేషాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తాజాగా వారణాసి మూవీకి డైరెక్టర్ రాజమౌళి రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ జక్కన్న ఎన్ని కోట్ల పారితోషికం అంటే?
దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ప్రాజెక్టు 'వారణాసి'. ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబు 'రుద్ర' అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. హీరోయిన్‌గా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన విలన్ పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ స్టార్ కాస్టింగ్ కారణంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు ఖాయమనే అంచనాలు వినిపిస్తున్నాయి. రాజమౌళి తండ్రి కేవీ విజయేంద్ర ప్రసాద్ అందించిన కథ ప్రకారం, వారణాసి ఆఫ్రికన్ అడవుల నేపథ్యంతో సాగే గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతోంది. భారత్‌తో పాటు అమెరికా, ఆఫ్రికా, యూరప్‌లోని పలు ప్రాంతాల్లో షూటింగ్ జరగనుంది.

ఇండస్ట్రీ వర్గాల ప్రకారం వారణాసి దాదాపు రూ.1300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది. అంతేకాదు, కేవలం ప్రమోషన్ల కోసమే సుమారు రూ.200 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు టాక్. గతంలో RRR తో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజమౌళి, ఈ సినిమాను కూడా అంతర్జాతీయ మార్కెట్‌లో అగ్రస్థానంలో నిలబెట్టాలనే వ్యూహంతో ముందుకెళ్తున్నారని తెలుస్తోంది.
రాజమౌళి భారీ రెమ్యూనరేషన్
ఇప్పుడు అసలు హాట్ టాపిక్ - రాజమౌళి పారితోషికం. సినిమా వర్గాల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే దర్శకుడు రాజమౌళి. ఒక్కో సినిమాకు ఆయన రూ.100 కోట్లకు పైగా ఛార్జ్ చేస్తున్నారని టాక్. అయితే.. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న వారణాసి కోసం ఆయన ఫిక్స్‌డ్ ఫీజు బదులు మొత్తం ఓవర్సీస్ రైట్స్‌ను తన రెమ్యూనరేషన్‌గా తీసుకున్నట్లు సమాచారం. దీని విలువ సుమారు రూ.160 కోట్లకు పైమాటే ఉంటుందని అంచనా. RRRతో గ్లోబల్ మార్కెట్‌లో వచ్చిన క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడమే ఈ స్ట్రాటజీగా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
మహేష్ బాబు కూడా బిజినెస్ పార్టనర్!
మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. మహేష్ బాబు ఈ సినిమాలో కేవలం హీరోగానే కాకుండా బిజినెస్ పార్టనర్‌గా కూడా వ్యవహరిస్తున్నారట. లాభాల్లో వాటా రూపంలో ఆయనకు దాదాపు రూ.200 కోట్ల వరకు వర్క్ అవుట్ అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది టాలీవుడ్ చరిత్రలోనే ఓ హీరో అందుకునే అత్యధిక పారితోషికంగా మారే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా.
ఇలా భారీ బడ్జెట్, ఇంటర్నేషనల్ స్టార్స్, గ్లోబల్ రిలీజ్ ప్లాన్, రికార్డు రెమ్యూనరేషన్లు ఇవన్నీ కలిపి వారణాసి ఇప్పటికే ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలుస్తోంది. రాజమౌళి బ్రాండ్ పవర్, మహేష్ బాబు స్టార్ డమ్ కలిసి ఈ సినిమా 'పాన్ వరల్డ్ ఈవెంట్ మూవీ'గా మార్చనున్నాయనే చెప్పాలి. ఈ కాంబినేషన్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలంటే.. ఇక 2027 ఏప్రిల్ 7 వరకు ఎదురుచూడాల్సిందే.


Click it and Unblock the Notifications











