SS Rajamouli రాజమౌళి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్​ కన్ఫామ్.. కానీ ఓ ఛేంజ్​ - దేవుడిపైనే భారం ఇక​!

విక్రమార్కుడు.. ఈ చిత్రానికి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. మాస్ మహారాజా కెరీర్​లో అందుకున్న బిగ్గెస్ట్​ హిట్లలో ఒకటి. పైగా దర్శకధీరుడు రాజమౌళి దీన్ని తెరకెక్కించారు. సాధారణంగా జక్కన్న తెరకెక్కించిన ఏ సినిమా అయినా.. సగం ఆయన ఇమేజ్​, కథ ద్వారా హిట్ అయితే మిగతా సగం హీరో ఇమేజ్​ యాక్షన్​తో బ్లాక్ బస్టర్ అవుతుంది. కానీ విక్రమార్కుడు అలా కాదు. పూర్తిగా రవితేజ క్రెడిట్ అనే చెప్పాలి. ఆయన జక్కన్ననే డామినేట్ చేసిన చిత్రమని చాలా మంది భావిస్తుంటారు.

పైగా ఈ విక్రమార్కుడు చిత్రం రవితేజ మార్కెట్​, రేంజ్​ను కూడా పెంచేసింది. ఇందులో ఆయన అత్తిలి సత్తిబాబు అనే దొంగగా పండించిన కామెడీ, విక్రమ్​ రాథోడ్​ అనే పోలీస్​ ఆఫీసర్​గా చేసిన పవర్​ ఫుల్​ యాక్షన్​ యాక్టింగ్​ ఆడియెన్స్​ను కట్టిపడేశాయి. ఇప్పటికీ దీన్ని ఎవరూ మర్చిపోలేరు. దాదాపు రూ.11 కోట్ల బడ్జెట్​తో తెరకెక్కి 2006లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు ఏకంగా రూ.23 కోట్ల వరకు వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

SS Rajmouli Raviteja Vikramarkudu Movie Sequel Confirm Cast And Crew Details Here

అయితే ఈ సినిమాకు సీక్వెల్ వస్తే బాగుంటుందని చాలా కాలంగా అభిమానులు ఆశిస్తున్నారు. కానీ దీనిపై ఎటువంటి క్లారిటీ నిన్నటి వరకు రాలేదు. ఎందుకంటే జక్కన్న తన బడా ప్రాజెక్ట్​లతో ఫుల్​ బిజీ అయిపోయారు. అలాగే రవితేజ కూడా ఈ సినిమాను జక్కన్న చేస్తే తప్ప ఇతర దర్శకుడు తెరకెక్కిస్తే నటించేందుకు రెడీగా లేరని అర్థమవుతోంది.

అయితే తాజాగా విక్రమార్కుడు సీక్వెల్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సీక్వెల్‌కు సంబంధించి స్టోరీ మొత్తం రెడీ అయినట్లు గోపిచంద్ భీమా చిత్రం నిర్మాత కేకే రాధామోహ‌న్ తాజా ప్రమోషన్స్​లో పేర్కొన్నారు. విక్ర‌మార్కుడు చిత్రానికి క‌థ‌ను అందించిన విజ‌యేంద్ర‌ప్ర‌సాదే ఈ సీక్వెల్ కూడా కథను సిద్ధం చేసిన‌ట్లు తెలిపారు.

SS Rajmouli Raviteja Vikramarkudu Movie Sequel Confirm Cast And Crew Details Here

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సీక్వెల్​కు రాజమౌళి దర్శకత్వం వహించరట. సంపత్ నంది అని చెప్పారు రాధా మోహన్​. విక్ర‌మార్కుడు 2 టైటిల్‌ను తాము మూడేళ్ల క్రిత‌మే త‌మ బ్యాన‌ర్‌పై రిజిస్ట‌ర్ చేయించుకున్నట్లు పేర్కొన్నారు. మరో విషయమేమిటంటే విక్ర‌మార్కుడు సీక్వెల్‌లో న‌టించ‌డానికి ర‌వితేజ కూడా ఇంట్రెస్టింగ్​గా లేరని చెప్పారు. కానీ తాను మాస్ మహారాజాను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. రవితేజ ఒప్పుకుంటేనే, లేదా స‌రైన కాంబినేష‌న్ సెట్‌ అయితేనే సినిమా మొదలుపెడతానని క్లారిటీ ఇచ్చారు.

ఇక ఈ మధ్యే విక్రమార్కుడు సీక్వెల్‌ గురించి రవితేజ మాట్లాడుతూ.. దీనిపై జక్కన్నతో ఇప్పటి వరకు నేనేమి మాట్లాడలేదు. రాజమౌళితో కలిసి పని చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. అసలు ఆయనతో కలిసి వర్క్​ చేయాలని భారతీయ సినీ పరిశ్రమలో ఎవరికి మాత్రం ఉండదు? అంటూ చెప్పుకొచ్చారు. కాగా, విక్ర‌మార్కుడు చిత్రంలో అనుష్క హీరోయిన్‌గా న‌టించి ఆకట్టుకుంది. కీర‌వాణి సంగీతం అందించారు. సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. తెలుగులో సూపర్ హిట్ సాధించిన ఈ చిత్రాన్ని క‌న్న‌డ‌, త‌మిళం, హిందీతో పాటు ప‌లు భాష‌ల్లోనూ రీమేక్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X