twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bheemlaa Nayak : పాపం ధమన్..కాపీ ట్యూన్ తో దొరికేసి, ఆ సినిమాలోది లేపేశారు అంటూ!

    |

    మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ థమన్ ప్రస్తుతం ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో మంచి ఫామ్ లో ఉన్నాడు. సూపర్ హిట్ సినిమాలు అందుకుంటూ స్టార్లతో సినిమాలు చేస్తూ ముందుకు వెళుతున్నాడు.. అయితే ముందు నుంచి కూడా థమన్ పాటలు ఎక్కువగా కాపీ వివాదానికి గురవుతుంటాయి. అయితే ఈ రోజు థమన్ సంగీతం అందిస్తున్న నాయక్ సినిమా సంబంధించిన టైటిల్ రివీల్ చేస్తూ ఫస్ట్ గ్లిమ్ప్స్ కూడా విడుదల చేశారు. అయితే దాని మీద ఇప్పుడు కాపీ వివాదం ముసురుకుంది. ఆ వివరాల్లోకి వెళితే

    రచ్చ చేస్తున్న ఫస్ట్ గ్లిమ్ప్స్

    రచ్చ చేస్తున్న ఫస్ట్ గ్లిమ్ప్స్

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - దగ్గుబాటి హీరో రానా కలిసి నటిస్తున్న తాజా మూవీ భీమ్లా నాయక్. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియం సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీ రేటు చెల్లించి మరీ తెలుగు రీమేక్ రైట్స్ కొనుక్కుంది. ఒక పెద్ద దర్శకుడి చేత సినిమా ప్రారంభిస్తారు అనుకుంటే ఒక సినిమా అనుభవం ఉన్న సాగర్ చంద్ర చేత సినిమా ప్రారంభింపజేశారు.

    అసలు విషయం ఏమిటంటే

    అసలు విషయం ఏమిటంటే

    అయితే ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ మాటలు అందిస్తుండటంతో పవన్ ఫ్యాన్స్ అయితే ఖుషి గానే ఉన్నారు. కానీ సినిమా రిలీజ్ సంక్రాంతి కి కావడంతో కాస్త టెన్షన్ అయితే వెంటాడుతోంది. నిజానికి ఈ సినిమాకి సంగీత దర్శకుడుగా థమన్ వ్యవహరిస్తుండడంతో సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. అయితే థమన్ ఇస్తున్న పాటలలో ఎక్కువగా కాపీ ట్యూన్స్ చేస్తున్నాడు అని కూడా ప్రచారం అవుతూ వస్తోంది. అయితే అదేమీ లేదని ఒక్కోసారి ట్యూన్స్ కాస్త శృతికి దగ్గరగా ఉన్నట్లు అనిపించవచ్చు.

    Recommended Video

    DSP Vs Thaman : ఎవరి పారితోషికం ఎక్కువ? Tollywood లో మ్యూజికల్ రేస్ ! || Filmibeat Telugu
    ఆ సినిమా నుంచి

    ఆ సినిమా నుంచి


    కానీ అది కాపీ చేసిన కాదని థమన్ కూడా ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే అనూహ్యంగా ఈ రోజు విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన భీమ్లా నాయక్ గ్లిమ్ప్స్ లో కొంత పార్ట్ ట్యూన్ వేరే సినిమాలోది కాపీ కొట్టినట్టు అనిపిస్తోందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. రజనీకాంత్ హీరోగా పెట్టా అనే సినిమా విడుదలైన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో ఉన్న కొంత భాగం ఈ భీమ్లా నాయక్ గ్లిమ్ప్స్ కోసం వాడారని సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రచారం జరుగుతోంది..

    ఎప్పుడూ స్పందించలేదు కానీ

    ఎప్పుడూ స్పందించలేదు కానీ

    అయితే నిజానికి కాపీ ట్యూన్స్ అన్నప్పుడు ఎప్పుడూ కూడా థమన్ నేరుగా స్పందించిన దాఖలాలు లేవు. కాబట్టి ఈ విషయంలో కూడా థమన్ స్పందించే అవకాశాలు లేవని అంటున్నారు.. మరి ఈ ట్యూన్స్ విషయంలో అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో యూనిట్ అయిన ఇప్పటికైనా కాస్త జాగ్రత్తలు తీసుకుని సినిమాలో అయినా కనీసం వాటిని రిపీట్ చేయకుండా ఉండేలా చూడాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుతున్నారు.

    మరో వివాదం

    మరో వివాదం

    ఈ సినిమా టైటిల్ మీద కూడా కాస్త వివాదం నెలకొంది. మలయాళంలో ఈ సినిమా మల్టీస్టారర్ లాగా ఉంటే ఇక్కడి సినిమా టైటిల్ అలాగే ఫస్ట్ గ్లిమ్ప్స్ కూడా సోలో హీరో సినిమా లాగా అనిపిస్తున్నాయి అని రానా అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఒక జర్నలిస్ట్ చేసిన ట్వీట్ కి స్పందిస్తూ ఈ సినిమా నిర్మాత నాగ వంశీ ఇవన్నీ చూసి ఒక నిర్ధారణకు రావద్దని ఇంకా తాము ఒక ఆర్డర్లో చేస్తూ వస్తున్నామని కవర్ చేసే ప్రయత్నం చేశారు. మరి ఈ వ్యవహారం ఇంకా ఎంత దూరం వెళుతుందో వేచిచూడాల్సి ఉంది.

    English summary
    Netizens are trolling badly that Thaman also copied Bhimla Nayak's music
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X