SSMB 28: మళ్ళీ అతడు, ఖలేజా తరహాలో త్రివిక్రమ్ ప్లాన్.. ఆ కమెడియన్ తో ప్రయోగం?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో తదుపరి సినిమాను చేసేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన షూటింగ్ ఇంకా మొదలు కాలేదు కానీ అప్పుడే ఇండస్ట్రీలో అనేక రకాల విషయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇక SSMB28 సినిమాలో కొంతమంది ప్రముఖ కమెడియన్లు కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఇక గతంలో అతడు కాలేజా సినిమాల్లో మహేష్ బాబును ఎలాగైతే చూపించాడో ఇప్పుడు అంతకుమించి అనేలా మరొక కామెడీ యాంగిల్ ను చూపించబోతున్నారట. కామెడీ సీన్స్ అయితే హైలైట్ గా ఉంటాయని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

సరికొత్త స్టార్ ఇమేజ్
సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఇదివరకే రెండు సినిమాలు వచ్చాయి. మొదటి సినిమా అతడు అనుకున్నంత స్థాయిలో రికార్డులను క్రియేట్ చేయలేకపోయింది. కానీ ఆ తర్వాత టెలివిజన్లో మాత్రం ఆ సినిమా ఊహించిన విధంగా టాప్ రేటింగ్స్ తో కొన్నేళ్ళ వరకు కొనసాగుతూ వచ్చింది. యాక్షన్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో సినిమా మహేష్ బాబుకు ఒకసారి కొత్త ఇమేజ్ను క్రియేట్ చేసింది ఆ తర్వాత ఖలేజా ఫ్లాప్ అయినప్పటికీ అందులో మహేష్ బాబు కామెడీ టైమింగ్ ఇప్పటికీ ప్రేక్షకులను ఎంతగానో కట్టుకుంటుంది.

మహేష్ సునీల్ కాంబో
అయితే మహేష్ బాబు త్రివిక్రమ్ కలయికలో వచ్చిన ఆ సినిమాల్లో కామెడీ మాత్రం చాలా బాగా వర్క్ అవుట్ అయింది. ముఖ్యంగా సునీల్ మహేష్ బాబు కాంబినేషన్ కు మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పటికి కూడా అందులో చేసిన సునీల్ పాత్రకు సంబంధించిన కొన్ని మీమ్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇక మరోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ సునీల్ మహేష్ బాబు కాంబినేషన్ ను కలపబోతున్నట్లుగా తెలుస్తోంది.

కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్
మహేష్ బాబు 28వ సినిమాలో కొన్ని కామెడీ ఎపిసోడ్స్ కూడా హైలెట్ కానున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రాజకీయ అంశాలతో పాటు యాక్షన్ సన్నివేశాలు అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ రొమాంటిక్ లవ్ ఎపిసోడ్స్ ఇక వాటికంటే విభిన్నంగా కామెడీ సీన్స్ కూడా ఉంటాయి అని తెలుస్తోంది. కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఫిలిమ్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను తెరపైకి తీసుకు రాబోతున్నట్లు సమాచారం.

ఆ సినిమాల్లో..
ఇక సునీల్ కూడా చాలాకాలంగా మంచి పాత్ర కోసమైతే ఎదురు చూస్తున్నాడు. ఇంతకుముందు అతను త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అరవింద సమేత అలాగే అల..వైకుంఠపురములో సినిమాల్లో కూడా కనిపించాడు. కానీ ఆ పాత్రల ద్వారా అతనికి ఇంకా అనుకున్నంత స్థాయిలో అయితే గుర్తింపు దక్కలేదు.

మరింత విభిన్నంగా..
ఇక మహేష్ బాబుతో SSMB28 సినిమాలో త్రివిక్రమ్ మళ్ళీ సునీల్ మరింత విభిన్నంగా చూపించాలి అని ఫిక్స్ అయ్యాడట. ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్ అయితే సిద్ధమయింది. ఇక రెగ్యులర్ షూటింగ్ ను ఆగస్టులో మొదలుపెట్టాలని అనుకుంటున్నారు. ఇక వచ్చే ఏడాది సమ్మర్లో సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉంది. మరి ఈ సినిమాతో అయినా సునీల్ మరింత గట్టిగా బౌన్స్ బ్యాక్ అవుతాడో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











