Don't Miss!
- News
‘భారత వ్యతిరేకి’ ఇల్హాన్ ఒమర్ శక్తివంతమైన యూఎస్ ఫారెన్ ఎఫైర్స్ ప్యానెల్ నుంచి ఔట్
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Finance
vodafone idea: బకాయిలను ఆ విధంగా కట్టమని వొడాఫోన్ ఐడియాకు ఆదేశం..
- Technology
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
SSMB 28: మహేష్ ఫ్యాన్స్ కు మరో బ్యాడ్ న్యూస్.. అప్పటి వరకు ఎదురు చూడాల్సిందే!
సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా రాబోతుంది అనగానే అభిమానులు ఎంతగానో సంతోషించారు. SSMB 28 సినిమా చాలా నెలల క్రితమే మొదలు కావాల్సింది. కానీ వివిధ కారణాల వలన ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక మొత్తానికి ఇటీవల మొదటి షెడ్యూల్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. కానీ మహేష్ బాబు ఇంట్లో వరుసగా విషాదాలు చోటు చేసుకోవడం వలన కూడా ఈ ప్రాజెక్టు మధ్యలో మరికొంత గ్యాప్ అయితే వచ్చింది.
ఇక మొత్తానికి మహేష్ బాబు త్రివిక్రమ్ చెప్పిన కథపై పూర్తిస్థాయిలో నమ్మకంతో లేకపోవడంతో మొదటి షెడ్యూల్ షూటింగ్ మొత్తం కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇక మళ్ళీ మరొక కొత్త తరహా కథను మొదలు పెట్టాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. రాబోయే మరికొన్ని రోజుల్లో SSMB 28వ ప్రాజెక్టులో మరో కొత్త తరహా కథతో షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్ లేకుండా వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు.

అయితే ఈ ప్రాజెక్టు విషయంలో విడుదల తేదీపై ఊహించని విధంగా మరొక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మొదట అనుకున్న స్టోరీ లైన్ షూట్ సమయానికి పూర్తయితే సమ్మర్లోనే మార్చి నెలలోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ మొదటి షెడ్యూల్ క్యాన్సిల్ కావడం ఆ తర్వాత మరొక కథను అనుకోవడం తో మహేష్ 28వ ప్రాజెక్ట్ సమ్మర్ తర్వాత విడుదలయ్యే అవకాశం ఉంది.
అంటే ఆగస్టు నెలలోనే ఈ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక టాక్ ప్రకారమైతే ఇండిపెండెన్స్ డేను టార్గెట్ గా చేసుకుని ఈ సినిమాను ఆగస్టు 11వ తేదీన విడుదల చేయాలని అనుకుంటున్నారు. వీకెండ్ తర్వాత కూడా కలిసి వచ్చే విధంగా నిర్మాతలు ఇలా డేట్ సెట్ చేసుకునే ఆలోచనలో ఉన్నారు. అయితే ఇంకా దర్శకుడు త్రివిక్రమ్ ఆ స్థాయిలో అయితే రిలీజ్ ప్లాన్ రెడీ చేసుకోలేనట్లుగా తెలుస్తోంది. ఇక దీనిపై ఒక క్లారిటీ రావాలి అంటే మరికొంత కాలం ఆగాల్సిందే.