SSMB29 : ఫ్యాన్స్‌కు మహేష్ బాబు డబుల్ ధమాకా.. జక్కన్న అసలేం ప్లాన్ చేస్తున్నావ్?
దర్శకధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో వస్తున్న మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో పలువురు స్టార్ హీరోలు నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ కు డబుల్ కిక్కిచ్చే న్యూస్ బయటకు వచ్చింది. మహేష్ బాబు రోల్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. అసలు ఆ విషయం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఇక మహేష్ బాబు.. తన నెక్ట్స్ మూవీ రాజమౌళితో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కథను ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేశాడు. క్యాస్ట్ అండ్ క్రూ కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. రాజమౌళి ఈసినిమా త్వరలోనే పట్టాలెక్కించనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం రాజమౌళి, మహేష్ బాబు సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటూ సూపర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో మహేష్ బాబు ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా ఇవ్వనున్నారట. ఆయన ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ఈ న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. అయితే రాజమౌళి టీమ్ నుంచి ఇప్పటివరకూ మహేష్ బాబు పాత్రకు సంబంధించి ఎలాంటి అఫిషియల్ అప్డేట్ ఇవ్వలేదు.
అయితే జక్కన్న సినిమాలో మహేష్ ఒకవేళ రెండు పాత్రల్లో నటిస్తున్నారనే విషయం తెలిస్తే... ఇది నిజంగా సూపర్ స్టార్ అభిమానులకు మాత్రం పండగే అని చెప్పవచ్చు. సూపర్ స్టార్ ను స్క్రీన్ మీద ఒక్కసారి చూస్తేనే ఆగరు. మరి అలాంటింది రెండు పాత్రల్లో కనిపిస్తే.. కన్నుల పండగే. బాక్సులు బద్దలు అవ్వడం ఖాయమని అంటున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది.

ఇక మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఈ విషయంపై వార్తలు బయటకు వచ్చాయి. కాగా ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు.. నాగార్జున కూడా నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. వీరితో పాటు హాలీవుడ్ నటులు, బాలీవుడ్ నటులు నటించనున్నారని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా స్టార్ట్ అయ్యే టైమ్ కల్లా మహేష్ బాబు యాడ్స్ కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే పలు యాడ్ షూట్స్ కంప్లీట్ చేశాడు మహేష్ బాబు. ఫోన్ పే, మౌన్ టెయిన్ డ్యూ వంటి యాడ్స్ పూర్తి చేశాడు. ఆ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ యాడ్ కూడా పూర్తిచేశాడని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ కానున్నాయి.


Click it and Unblock the Notifications











