SSMB 29: మహేష్, రాజమౌళి మూవీ ఫస్ట్ లుక్ లీక్... టామ్ క్రూయిజ్ ఏం సరిపోయాడు బాబోయ్!

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇప్పుడు ఆయన ప్రపంచవ్యాప్త గుర్తింపు పొంది... స్టార్ డైరెక్టర్ అయిపోయారు. ఇక ఆయన నెక్ట్స్ సినిమా కోసం వరల్డ్ మొత్తం ఎదురు చూస్తోంది. ఇక ఆయన నెక్ట్స్ మూవీ మహేశ్ బాబుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ నుంచి ఒక లుక్ లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ లుక్ చూసిన నెటిజన్స్.. వివిధ రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే....

ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి ప్రపంచవ్యాప్త గుర్తింపును, ఫేమ్ ను సంపాదించుకున్నారు. ఇక ఆయన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ఎన్నో అవార్డులతో పాటు.. ప్రశంసలు కూడా వచ్చాయి. హాలీవుడ్ డైరెక్టర్లు ఎంతో మంది ఆయన సినిమాకు ఫిదా అయిపోయారు. ఇక తెలుగు సినిమా ఖ్యాతినే కాదు.. భారతీయ సినిమాకు గుర్తింపు తీసుకువచ్చాడు రాజమౌళి. ఇక ఇండియన్ టాప్ డైరెక్టర్స్ లోనే కాదు.. వరల్డ్ వైడ్ టాప్ డైరెక్టర్స్ లో రాజమౌళి ఒకరు.

Tollywood Director SS Rajamouli

ఇక రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తర్వాత చేయబోతున్న సినిమాపై ఇప్పటికే భారీ లెవెల్ లో అంచనాలు నెలకొన్నాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా ఈ సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. మహేశ్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకుడు. ఇక ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ షూటింగ్ పూర్తి చేసే పనిలో పడ్డారు మూవీ మేకర్స్.

మహేష్ బాబు గుంటూరు కారం ఈ పాటికే రిలీజ్ కావాల్సి ఉండే. కానీ పలు కారణాలతో షూటింగ్ వాయిదా పడుతూ.. ఆలస్యం అవుతూ వస్తుంది. ఇక ఎట్టకేలకు సంక్రాంతి రేసులో గుంటూరు కాలం నిలిచింది. మరి వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీ పూర్తి అయిన తర్వాత మహేశ్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Mahesh Babu SS Rajamouli Movie Look Leak News Goes Viral

రాజమౌళి, మహేశ్ బాబు సినిమా పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కనుందని సమాచారం. ఇండియానా జోన్స్ తరహాలో గ్లోబల్ కథతో మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తానని రాజమౌళి ఇప్పటికే చెప్పుకువచ్చాడు. ఈ సినిమాపై పాన్ వరల్డ్ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. అవతార్, అవెంజర్స్, టెర్మినేటర్, ఇండియానా జోన్స్ తరహాలో కూడా ఒక ప్రాంచైజీ అయ్యేలా చేయాలనేది జక్కన్న ప్లాన్ అని తెలుస్తోంది. ఇక ఈ ఏడాది SSMB 29 పనులు మొదలు పెట్టనున్నట్లు సమాచారం.

mahesh babu leaked look from rajamouli movie

అయితే SSMB 29 సినిమాకు సంబంధించిన ఓ లుక్ నెట్టింట వైరల్ గా మారింది. మహేష్ అభిమానులు ఎవరో పెన్సిల్ ఆర్ట్ తో మహేష్ బాబు ఫోటో స్కెచ్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ లుక్ లో మహేష్ బాబు SSMB 29 సినిమా చేస్తే మిషన్ ఇంపాజిబుల్, ఇండియానా జోన్స్ వంటి సినిమాల వలే.. ఈ సినిమా కూడా ఓ రేంజ్ ఉంటుందని అంటున్నారు. ఇక ఎవర్రా టామ్ క్రూయిజ్.. ఆయన మహేశ్ బాబు ముందు సరిపోడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X