SS Rajamouli: మహేశ్ బాబు కోసం ఆ బ్యూటీని లైన్‌లో పెడుతున్న జక్కన్న... ఆ లక్కీ హీరోయిన్ ఎవరో తెలిస్తే?
సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇక ఈ సినిమా తర్వాత మహేశ్ బాబు.. జక్కన్నతో పని మొదలు పెట్టనున్నాడు. అయితే ఈ సినిమాపై ఇప్పటికే పలు వార్తలు బయటకు వచ్చాయి. తాజాగా ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ ముద్దు గుమ్మను తీసుకోవాలని జక్కన్న పట్టుబడుతున్నాడట. అంతే కాదు.. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు పోతుందనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలవనుంది. జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయితే.. మహేశ్ బాబు.. జక్కన్నతో పని మొదలు పెట్టనున్నాడు. ఇక ఈ సినిమా మొదలు కూడా కాలేదు.. అప్పుడే అంచనాలు మొదలు అయ్యాయి. దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కునుంది.

ఇక ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటూ సూపర్ స్టార్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ కొత్త సంవత్సరంలో అయిన మహేష్ బాబు, జక్కన్న చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్లు వస్తాయని ఆశగా చూస్తూన్నారు అభిమానులు. అయితే ఈ సినిమా గురించి తాజాగా ఓ అదిరిపోయే వార్త టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.
మహేశ్ బాబు జక్కన్న మూవీ మార్చిలో పూజా కార్యక్రమాలు ప్రారంభించాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా స్టోరీ ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ థ్రిల్లర్ గా సాగుతోందని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ రాస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ స్టోరీలో హీరోయిన్ కు కూడా కీలక పాత్ర ఉంటుందని టాక్ వినిపిస్తుంది.

ఇక ఈ సినిమా పాన్ ఇండియా కాకుండా.. పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కీలకమని తెలుస్తోంది. ఇక ఈ హీరోయిన్ కోసం... దర్శక ధీరుడు రాజమౌళి తెగ వెతుకుతున్నారని తెలుస్తోంది. కాగా ఇందుకోసం జక్కన్న ఇప్పటికే బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంకను కలిసి రెండు సార్లు ఆమెతో చర్చలు జరిపినట్లు చర్చలు జరిపారని సమాచారం. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం హాట్ టాపిక్ గా మారింది.
ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ సినిమాగా..హాలీవుడ్ సాంకేతిక నిపుణులను భాగస్వామ్యం చేస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటుందట. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం మార్చిలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించబోతున్నారని సమాచారం.


Click it and Unblock the Notifications











