SSMB28: మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు షాకిచ్చే న్యూస్.. స్టార్ డైరెక్టర్‌తో సినిమా ఆగిపోయిందా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలంగా బడా హీరోగా దూసుకుపోతోన్న వారిలో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. కృష్ణ కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్‌ అన్నింటికీ మించి హ్యాండ్సమ్ లుక్స్‌తో ప్రత్యేకమైన ఇమేజ్‌ను అందుకున్నాడు. దీనికితోడు కెరీర్‌ ఆరంభంలోనే వరుస హిట్లతో సత్తా చాటాడు. మధ్యలో పరాజయాల పరంపరతో ఇబ్బందులు ఎదుర్కొన్నా.. కొంత కాలంగా హిట్లు మీద హిట్లు కొడుతూ మహేశ్ బాబు సూపర్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు. ఈ జోష్‌తోనే ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా పలు ప్రాజెక్టులను ఇప్పటికే లైన్‌లో పెట్టుకుని ముందుకు వెళ్తున్నాడు.

హ్యాట్రిక్ హిట్లతో ఫుల్ జోష్‌తో ఉన్న మహేశ్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తున్నాడు. దాదాపు ఈ సినిమాను సంబంధించిన 70 శాతం షూటింగ్ కంప్లీట్ అయింది. మిగిలిన దాని కోసం షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సూపర్ స్టార్ మోకాలికి సర్జరీ చేయించుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఇందుకోసం అతడు మరికొన్ని రోజుల్లోనే అమెరికాకు వెళ్లబోతున్నాడు. ఇది పూర్తైన తర్వాత అతడు రెండు మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. దాని వల్ల ఇప్పుడు చేస్తున్న సినిమాతో పాటు ఫ్యూచర్ ప్రాజెక్టులు సైతం వాయిదా పడతాయని అంటున్నారు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మహేశ్ బాబు కొద్ది రోజుల క్రితమే ఓ సినిమాను ప్రకటించాడు. నిజానికి ఇది 'సర్కారు వారి పాట' పూర్తైన వెంటనే అంటే డిసెంబర్‌లోనే మొదలవుతుందని వార్తలు వచ్చాయి. కానీ, ఆ చిత్రం కూడా పలు కారణాలతో అనుకున్న సమయానికి పూర్తి కాలేదు. అంతేకాదు, ఇంకా కొంత భాగం బ్యాలెన్స్ ఉండిపోయింది. దీనికితోడు ఇప్పుడు మహేశ్ బాబుకు సర్జరీ జరుగుతోన్న నేపథ్యంలో 'సర్కారు వారి పాట' మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ఇప్పట్లో మొదలయ్యే ఛాన్స్‌లు లేవని ప్రచారం జరుగుతోంది.

SSMB28: Mahesh Babu and Trivikram Movie stopped

మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ప్రకటించిన సినిమా ఫిబ్రవరి నుంచి రెగ్యూలర్ షూటింగ్‌ను జరుపుకోనుందని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ, తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. అసలు ఈ సినిమా మొదలయ్యే అవకాశాలే లేవని తెలుస్తోంది. దీనికి కారణం 'సర్కారు వారి పాట' పూర్తి అవడానికే దాదాపు ఫిబ్రవరి వరకూ సమయం కావాల్సి ఉందట. ఆ తర్వాత ఈ సినిమా రిలీజ్ కోసం మహేశ్ బాబు ప్రమోషన్స్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. వాటి తర్వాత మరో రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని అతడు డిసైడ్ అయ్యాడట. దీంతో త్రివిక్రమ్ మూవీ ఉంటుందా? ఉండదా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇదిలా ఉండగా.. మహేశ్ బాబు.. దర్శకధీరుడు రాజమౌళితో సైతం ఓ సినిమాను చేయనున్నాడు. ఇప్పుడు RRR జనవరిలో విడుదల కానుంది. దీంతో ఫిబ్రవరి నుంచి మహేశ్ మూవీపై జక్కన్న ఫోకస్ చేయబోతున్నాడని అంటున్నారు. అదే జరిగి... ప్రీ ప్రొడక్షన్ అంతా త్వరగా పూర్తైతే.. అసలు త్రివిక్రమ్ మూవీ పట్టాలెక్కే అవకాశాలే ఉండన్న టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X