మహేశ్ బాబు SSMB29లో ఇద్దరు స్టార్ హీరోయిన్లు.. బాలీవుడ్ హాలీవుడ్ బ్యూటీలతో జక్కన్న స్కెచ్!

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు మాములుగా ఉండవు. జక్కన్న, టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో కలయికలో సినిమా రావాలని గత పుష్కరకాలం నుంచి అభిమానులు, ప్రేక్షకులు, సినీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వీరిద్దరి కాంబోలో SSMB29గా సినిమా రానున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సినిమాపై క్యూరియాసిటీ పెరుగుతూ వస్తోంది. ఈ సినిమా ఎలా ఉండబోతుంది.. ఏ జోనర్ లో తెరకెక్కించనున్నారని పలు రకాలుగా టాక్ నడిచిన విషయం తెలిసిందే. అయితే ఇందులో హీరోయిన్స్ ఎవరనే అంశం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో మహేశ్ కోసం ఇద్దరు ముద్దుగుమ్మలు రెడీ చేస్తున్నాడట జక్కన్న.

 జక్కన్న తర్వాతి చిత్రం..

జక్కన్న తర్వాతి చిత్రం..

మార్చి 13న ఉదయం RRRకు అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం ఆస్కార్ అవార్డ్ వరించింది. ఈ విజయాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్న దర్శక దిగ్గజం రాజమౌళి తన తర్వాతి సినిమా కోసం పకడ్బందీగా ప్లాన్స్ వేస్తున్నారు. జక్కన్న తర్వాత చెక్కబోయే చిత్రం సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా వస్తున్న SSMB29. ఈ సినిమా కోసం ఆయన పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడని టాక్. ఇక జక్కన్న ఒక సినిమా కథ చెక్కితే ఎలా ఉంటుందో తెలిసిందే.

రైటర్ చెప్పినట్లుగా..

రైటర్ చెప్పినట్లుగా..

అయితే ఇంతకు ముందు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత, దర్శకుడు కె. విజయేంద్ర ప్రసాద్ చెప్పిన దాన్ని బట్టి మహేశ్ బాబుతో చేయబోయే సినిమా అమెజాన్ అడవుల్లో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుంది అని ఒక టాక్ అయితే వినిపించింది. విజయేంద్ర ప్రసాద్ చెప్పినట్లుగానే ఇండియానా జోన్స్ వంటి యాక్షన్ అండ్వెంచరస్ సినిమాగా ఉండనుందని ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.

 గ్లోబల్ స్థాయిలో..

గ్లోబల్ స్థాయిలో..

హాలీవుడ్ స్థాయిలో రాజమౌళి తెరకెక్కిస్తున్న SSMB29 కోసం ఒక ప్రముఖ హాలీవుడ్ గ్రాఫిక్స్ సంస్థతో కూడా ప్రాజెక్టు గురించి చర్చలు జరిపినట్లు ఇదివరకు తెలిసిన విషయమే. ముందుగానే గ్రాఫిక్స్ విషయంలో కూడా ఒక ప్లాన్ రెడీ చేసుకుంటున్నారని అర్థమవుతోంది. ఇక RRR సినిమా రాజమౌళి స్టాండర్డ్ గ్లోబల్ స్థాయిలో పెరిగింది. అంతేకాకుండా అంతర్జాతీయంగా మార్కెట్ కూడా పెరిగింది. దీంతో ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో అందరినీ ఆకట్టుకునే విధంగా పెద్ద చిత్రాన్ని అందించాలన్నది జక్కన్న ప్లాన్.

వాళ్లతో జక్కన్న చేతులు..

వాళ్లతో జక్కన్న చేతులు..

గ్లోబల్ రేంజ్ లో తెరకెక్కించేందుకు SSMB29 కథను రెండు భాగాలుగా లేదా సీక్వెల్ గా చేయనున్నట్లు జక్కన్న ఆలోచిస్తున్నారట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సీక్వెల్స్ ఉంటాయని, వీటిల్లో కథ మారుతుందని, ప్రధాన పాత్రలు మాత్రం అలాగే ఉంటాయని విజయేంద్ర ప్రసాద్ చెప్పినట్లుగా కథనాలు కూడా వచ్చాయి. అందుకే ఈసారి హాలీవుడ్ ప్రొడక్షన్ హౌజెస్ తోపాటు టెక్నీషియన్స్ తోనూ జక్కన్న చేతులు కలుపుతున్నారట.

 ఇద్దరు హీరోయిన్స్..

ఇద్దరు హీరోయిన్స్..

ఇప్పటికే హాలీవుడ్ సంస్థ క్రియేటివ్ ఆర్టిస్ట్ ఏజెన్సీ (CAA)తో భాగం అయినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సంస్థ ప్రముఖ హాలీవుడ్ నటీనటులను సినిమాలో నటించేందుకు ఒప్పిస్తుంది. ఇందులో భాగంగానే థోర్ హీరో క్రిస్ హేమ్స్ వర్త్ ను SSMB29లో నటిస్తారని టాక్ నడుస్తోంది. ఇప్పుడు ఈ సినిమాలో హాలీవుడ్ ముద్దుగుమ్మ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు.

హాలీవుడ్ బ్యూటీ..

హాలీవుడ్ బ్యూటీ..

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన దీపిక పదుకొణె SSMB29లో ఒక హీరోయిన్ గా చేయనునందట. దీపిక ఇంతకుముందు హాలీవుడ్ మూవీ కూడా చేసింది. ఇక మరోక హీరోయిన్ గా జెన్నా ఒర్టెగా కనిపించనుందని టాక్. ఇటీవల విడుదలై సూపర్ క్రేజ్ తెచ్చుకున్న వెడ్నెస్ డే సిరీస్ హీరోయినే ఈ ముద్దుగుమ్మ. ఇలా జక్కన్న హీరోయిన్ల విషయంలోనూ మాస్టర్ ప్లాన్ వేశారని టాక్. ఇక దుర్గా ఆర్ట్స్ అధినేత కెఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఈ ఏడాది ద్వితీయార్థంలో పూజా కార్యక్రమాలు చేయనున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో తెరకెక్కించేలా ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X