SSMB29 ఈవెంట్‌కు అనుమతిపై ఆంక్షలు.. టెన్షన్‌లో రాజమౌళి, మహేష్ బాబు

SSMB29 Event: రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కనున్న పాన్-ఇండియా సినిమా "SSMB29". ఈ పాన్ వర్డల్ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాకుండా ప్రపంచ సినీ వర్గాల్లోనూ పెద్ద చర్చనీయాంశమైంది. ఈ సినిమాకు సంబంధించిన మొదటి ఈవెంట్ నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుండి అభిమానుల్లో ఊహించని ఉత్సాహం నెలకొంది. అయితే తాజా పరిణామాలు ఈ గ్రాండ్ ఈవెంట్‌పై మబ్బులు కమ్ముకున్నట్లు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగింది? ఈ ఈవెంట్ జరుగుతుందా? లేదా?

రాజమౌళి-మహేష్ బాబు కాంబో మూవీ కోసం సినీ ప్రేమికులు ఎదురుచూస్తోంది. ఇద్దరూ కలిసి చేసే సినిమా గురించి అధికారిక ప్రకటన రాకముందే భారీ హైప్ క్రియేట్ అయింది. ప్రస్తుతం "గ్లోబ్ ట్రాటర్ (GlobeTrotter),SSMB29" అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం పిలవబడుతోంది. ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌ను ప్రకటించడంలో ఆలస్యం జరిగినప్పటికీ, రాజమౌళి-మహేష్ బాబు కలిసి సినిమా చేస్తున్నారన్న వార్త మాత్రం మీడియా లీకుల ద్వారా ముందుగానే వైరల్ అయిపోయింది. అప్పటినుంచి ఈ మూవీ గురించే చర్చ జరుగుతోంది.

SSMB29 Grand Launch in Trouble

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మొదటి ఈవెంట్‌కి ప్లాన్ ఫైనల్ అయింది. నవంబర్ 15న సాయంత్రం 5.30 గంటలకు రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించబోతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే దాదాపు పూర్తి కావచ్చాయి. సెట్ డిజైన్స్, గెస్ట్ లిస్టు, సెక్యూరిటీ ఏర్పాట్లతో ఈవెంట్‌ను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ ఈవెంట్‌కు సంబంధించి కొన్ని కఠిన నిబంధనలు అమలులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ భారీ ఈవెంట్‌పై కొంత అనిశ్చితి నెలకొంది.

ఇటీవల ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్‌లో 10 మందికి పైగా మృతి చెందగా, దాన్ని ఉగ్రవాద చర్యగా భావించిన కేంద్ర గూఢచారి సంస్థలు దేశవ్యాప్తంగా సెక్యూరిటీని హై అలర్ట్‌లోకి తీసుకెళ్లాయి. ముఖ్యంగా హైదరాబాద్ సహా అన్ని మెట్రో నగరాల్లో కఠిన తనిఖీలు, భద్రతా చర్యలు అమల్లోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో, లక్షలాది మంది అభిమానులు, మీడియా ప్రతినిధులు, సినీ ప్రముఖులు హాజరయ్యే ఈవెంట్‌కి పోలీసులు అనుమతి ఇస్తారా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

ఇప్పటి వరకూ ఉన్న సమాచారం ప్రకారం.. GlobeTrotter ఈవెంట్ కోసం ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రత్యేక సెట్‌లు, సెక్యూరిటీ ఏర్పాట్లు, గెస్ట్ మేనేజ్‌మెంట్ అన్నీ ముందుగానే ప్లాన్ చేశారు. ఈవెంట్ లైవ్ టెలికాస్ట్ రైట్స్ కూడా జియో హాట్‌స్టార్‌కి అమ్ముడయ్యాయి. మొదట మీడియా, ఫ్యాన్స్ అందరికీ కఠిన సెక్యూరిటీ చెకింగ్‌లతో అనుమతి ఇవ్వాలని భావించిన నిర్వాహకులు, ఇప్పుడు మార్గం మార్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

ఇటీవలి భద్రతా సూచనల నేపథ్యంలో, హైదరాబాద్ పోలీసులు ప్రస్తుతం ఏ అవుట్‌డోర్ ఈవెంట్లకు కూడా అనుమతులు ఇవ్వడాన్ని నిలిపివేశారని తెలుస్తోంది. దీని వలన #GlobeTrotter ఈవెంట్‌ను పబ్లిక్ ఈవెంట్‌గా కాకుండా క్లోజ్డ్ ఈవెంట్‌గా మార్చే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే అభిమానులు, మీడియా రాకుండా, కేవలం సినిమా టీమ్ సభ్యులతో మాత్రమే ఈ వేడుక జరిపే అవకాశం ఉందని సినీ వర్గాల టాక్.

ఫ్యాన్స్ విషయానికి వస్తే, లక్షల్లో హాజరుకావడానికి సిద్ధమైన మహేష్ బాబు అభిమానులు ఇప్పుడు నిరాశ చెందే పరిస్థితి ఏర్పడవచ్చు. పోలీస్ భద్రతా పరిమితులు, ట్రాఫిక్ కంట్రోల్ సమస్యలు, ప్రజల సురక్షితంగా నిర్వహించలేమన్న కారణాలతో అనుమతి రాకపోవచ్చని సమాచారం. అయితే, సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈవెంట్ రద్దు అయ్యే అవకాశం మాత్రం లేదు. ఇప్పటికే భారీగా ఖర్చు పెట్టినందున, నిర్మాతలు ఈవెంట్‌ను చిన్న స్థాయిలో అయినా క్లోజ్డ్ డోర్ ఈవెంట్ గా నిర్వహించేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.

More from Filmibeat

Read more about: ss rajamouli mahesh babu ssmb29
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X