SSMB29 స్టోరీ లీక్.. మైథలాజికల్ వార్ జోన్‌లోకి మహేష్.. ఆ ఫారెస్ట్ చుట్టూనే?
ఆర్ఆర్ఆర్‌తో టాలీవుడ్‌ను గ్లోబల్ రేంజ్‌కు చేర్చిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి.. సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో చేస్తున్న మూవీ ఎస్ఎస్ఎంబీ 29. అడ్వెంచర్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై టాలీవుడ్ టూ బాలీవుడ్ ఎన్నో అంచనాలున్నాయి. దాదాపు రూ.1000 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు జక్కన్న. కానీ ఇంత వరకు కథేంటీ అన్నది తెలియరాలేదు. తన సినిమా విషయంలో ప్రతి అంశాన్ని సీక్రెట్‌గా ఉంచే రాజమౌళి .. మహేశ్ చిత్రం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
లీకులపై రాజమౌళి కన్నెర్ర
ఎస్ఎస్ఎంబీ 29 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రాజెక్ట్‌కు టైటిల్ ఏంటీ అన్నది ఇంత వరకు తెలియరాలేదు. సోషల్ మీడియాలో రకరకాల టైటిల్స్, ఫ్యాన్స్ క్రియేట్ చేసిన ట్రైలర్లు, టీజర్లు చక్కర్లు కొడుతున్నాయి. సినిమా గురించి ఏ చిన్న అప్‌డేట్ ఇవ్వకపోవడంతో మహేశ్ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఒడిషాలో జరిగిన షూటింగ్ సందర్భంగా లోకేషన్ దృశ్యాలు, కొంత ఫుటేజ్ లీకై ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతుండటంతో రాజమౌళి మరింత కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు.

అప్‌డేట్స్ కోసం మహేశ్ ఫ్యాన్స్ వెయిటింగ్
సూపర్‌స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని ఎస్ఎస్ఎంబీ 29పై ఏదో ఒక అప్‌డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆశించినా నిరాశే ఎదురైంది. అయితే ఆగస్ట్ 9న మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఖచ్చితంగా ట్రీట్ ఉంటుందని ఫిలింనగర్ వర్గాలు భావిస్తున్నాయి. కానీ ఎక్కడో చిన్న అనుమానం కూడా అభిమానులను వేధిస్తోంది. ఎస్ఎస్ఎంబీ 29లో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌లు కీలకపాత్ర పోషిస్తున్నారు. మిగిలిన స్టార్ క్యాస్టింగ్ గురించి ఎలాంటి వివరాలు తెలియరాలేదు.
ఎస్ఎస్ఎంబీ29లో మాధవన్?
రెండ్రోజుల క్రితం కోలీవుడ్ సీనియర్ హీరో మాధవన్.. ఎస్ఎస్ఎంబీ 29లో కీలకపాత్ర పోషించనున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ దీనిపై రాజమౌళి కానీ, చిత్ర యూనిట్ కానీ ఎలాంటి స్పందన చేయలేదు. మహేశ్ - రాజమౌళి సినిమా స్టోరీ ఇదేనంటూ గతంలో పలు కథనాలు వైరల్ అయ్యాయి. తాజాగా సోషల్ మీడియాలో దీని గురించి ఓ లైన్ చక్కర్లు కొడుతోంది. భారతీయుల ఇతిహాసం రామాయణంలోని కొన్ని ఘటనల ఆధారంగా ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ అయ్యిందని పుకార్లు వైరల్ అవుతున్నాయి.
రామాయణం ఇన్సిపిరేషన్‌తో స్టోరీ
ప్రధానంగా రామ- రావణ యుద్ధంలో ఇంద్రజిత్ అస్త్రం ధాటికి లక్ష్మణుడు కుప్పకూలిపోవడంతో తమ్ముడి కోసం శ్రీరామచంద్రుడు తల్లడిల్లిపోతాడు. అయితే వానర సైన్యంలోని వైద్యులు సంజీవని మూలిక గురించి చెప్పడంతో దానిని తాను సాధించి తీసుకొస్తానని ఆంజనేయుడు బయల్దేరి ఏకంగా సంజీవని పర్వతాన్ని పెకలించుకుని వచ్చి లక్ష్మణుడిని బతికిస్తాడు. ఈ ఘటన ఆధారంగానే ఎస్ఎస్ఎంబీ 29 మెయిన్ థీమ్ సిద్ధమైనట్లుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పైగా మహేశ్ పాత్ర తొలి నుంచి అడవుల్లో సాహసయాత్ర చేసే వ్యక్తిలా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతుండటం ఈ కథనాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.
ప్రస్తుతం దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలు రామాయణ, మహాభారతాల ఆధారంగా సినిమాలు తీస్తుండటంతో రాజమౌళి కూడా అదే దారిలో వెళ్లాడా అంటూ నెట్టింట చర్చ జరుగుతోంది. మరి దీనిలో ఎంత వరకు నిజముందో తెలియాలంటే ఎస్ఎస్ఎంబీ 29 నుంచి టీజర్ లాంటిదేమైనా రావాల్సిందే. అప్పటి వరకు సోషల్ మీడియాలో ఇలాంటి గాసిప్స్‌కు అంతే ఉండదు.


Click it and Unblock the Notifications











