ప్రభాస్‌ను ఫాలో అవ్వాలని జక్కన్న కండిషన్ - షాకయ్యే రేంజ్లో 6 ప్యాక్‌తో మహేశ్ బాబు న్యూలుక్ రెడీ!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ విషయంలో మాత్రం ఆయన ఎంతో పర్ఫెక్ట్గా ఉంటారు. ప్రస్తుతం ఆయన వయసు 48 ఏళ్ళు అయినప్పటికీ కూడా 25 ఏళ్ళ కుర్రాడిలానే ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటారు. రీసెంట్గా గుంటూరు కారం చిత్రంలోనూ ఎంతో యంగ్ అండ్ ఫ్రెష్ లుక్‌లో కనిపించి ప్రేక్షకుల్ని ఫిదా చేశారు. అయితే ఇప్పుడాయన రాజమౌళి సినిమా కోసం మరింత ఫిట్‌గా ఉండేందుకు ఎంతగానో శ్రమిస్తున్నారు.
జిమ్‌లో కూడా ఎక్కువ సమయం కేటాయించి మరీ కసరత్తులు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా ఆయన షాకింగ్ రేంజ్లో సిక్స్ ప్యాక్‌లో కనిపించి అటు ఫ్యాన్స్‌కు ఇటు నెటిజన్లకు షాక్ ఇచ్చారు. అలా జక్కన్న కూడా మహేశ్‌కు ప్రభాస్‌ను ఫాలో అవ్వాలని ఓ కండిషన్ పెట్టారట. దాని గురించే ఈ కథనం..

మహేశ్ బాబు ఈ పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అమ్మాయిల కలల రాకుమారుడు. వయసు హాఫ్ సెంచరికీ అడుగు దూరంలో ఉన్నా ఇప్పటికీ యంగ్ అండ్ స్టైలిష్‌గా కనిపిస్తూ అందరి మనసులను దోచేస్తున్నారు. రీసెంట్గా గుంటూరు కారం చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. టాక్ పరంగా మిక్స్డ్ టాక్ అందుకున్నా వసూళ్లు మాత్రం బాగానే వచ్చాయి. ప్రస్తుతం ఆయన రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.
మరి జక్కన్నతో సినిమా అంటే వ్యవహారం ఎలా ఉంటుందో తెలిసిన విషయమే. ఏళ్ల తరబడి సమయాన్ని ఆయన కోసమే కేటాయించాల్సి వస్తది. ఒళ్ళు హూనం చేసుకుని మరీ పగలు రాత్రి సినిమా కోసం హీరోలు కచ్చితంగా కష్టపడాల్సిందే! ఇప్పటికే ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్ వంటి హీరోలు జక్కన్న సినిమా కోసం ఎంతలా కష్టపడ్డారో మేకింగ్ వీడియోలను చూస్తూనే ఉన్నాం.
ఇక ఇప్పుడు మహేశ్ బాబు వంతు వచ్చేసింది. ఇప్పటికే శరీరాకృతి పరంగా స్పెషల్ ట్రైనర్‌ను పెట్టుకుని మహేశ్ బాగా కష్టపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే విదేశాలకు కూడా వెళ్లి అక్కడి వైద్యుల వద్ద ఫిట్నెస్ హెల్త్‌కు సంబంధించిన టిప్స్ కూడా తెలుసుకుని వచ్చారు. అయితే తాజాగా ఆయనకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో షాకింగ్‌గా మారింది. అందులో ఆయన షర్ట్ తీసేసి కసరత్తులు చేస్తూ ఆరు పలకల దేహంతో కనిపించి భారీ షాక్ ఇచ్చారు!

అయితే ఒక మూడు సెకన్ల పాటు తీక్షనంగా చూశాక అర్థమవుతోంది అది నిజం పిక్ కాదని. అది ఎడిట్ చేసిన ఫొటో అని. కాకపోతే ఈ చిత్రం కోసం మహేశ్‌కు జక్కన్న ఓ మాట చెప్పారట. బాడీ చాలా ఫిట్‌గా జిమ్ బాడీలా కనిపించారని అన్నారట. ప్రభాస్ తరహాలో కటౌట్స్ తిరిగేలా పెంచాలని సూచించారని బయట టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా మహేశ్ ఈ సినిమా కోసం బాగా కష్టపడుతున్నారని తెలిసింది. చూడాలి మరి మహేశ్ ఈ సినిమా కోసం తన శరీరాకృతిని ఎలా మార్చుకుంటారో, ఎలాంటి సరికొత్త లుక్‌లో కనపడతారో.. కాగా, ఈ చిత్రం రూ.1000కోట్ల బడ్జెట్‌తో ఫారెస్ట్ అండ్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతోంది.


Click it and Unblock the Notifications











