SSMB29లో ఫస్ట్ సాంగ్.. మహేశ్, ప్రియాంక చోప్రాతో దుమ్మురేపే స్టెప్పులు
బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి భారీ చిత్రాల తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఎస్ఎస్ఎంబీ29. సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రం గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ అందింది.
ఎస్ఎస్ఎంబీ29 మూవీ కాస్ట్..
ఎస్ఎస్ఎంబీ29 ప్రాజెక్ట్ లో మహేశ్ బాబు, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్నారు. మళయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు ఇండోనేషియా నటి చెలిసా కూడా హీరోయిన్ గా నటిస్తోందని తెలుస్తోంది. మరోవైపు హాలీవుడ్ కు సంబంధించిన పలువురు నటీనటులు కూడా నటిస్తున్నారని సమాచారం. వారి గురించి పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది.

ఎస్ఎస్ఎంబీ29 బడ్జెట్, టెక్నీషియన్లు..
ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఆస్కార్ ఆవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మరోవైపు హాలీవుడ్ కు చెందిన టాప్ టెక్నీషియన్లు వీఎఫ్ఎక్స్ వర్క్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇలా భారీ ఎత్తున ఈ చిత్రం రూపుదిద్దుకుంటుండటంతో సినిమాకు రూ.1000 కోట్ల వరకు బడ్జెట్ వెచ్చిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత కేఎల్ నారాయణ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఎస్ఎస్ఎంబీ29 షూటింగ్ వివరాలు..
సూపర్ స్టార్ మహేశ్ బాబు - ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ఇది. ఈ ప్రాజెక్ట్ కు ఇంకా టైటిల్ ఫిక్స్ అవలేదు. SSMB29 వర్క్ టైటిల్ తో షూటింగ్ జరుగుతోంది. ఆఫ్రికన్ అడవుల్లో సాగే అడ్వెంచరస్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో 2025 ఫిబ్రవరి 2న ప్రారంభించారు. హైదరాబాద్ తో పాటు, కెన్యాలో షూట్ చేశారు. ఇక మార్చిలో రెండో షెడ్యూల్ కు ఓడిషాలో భారీ సెట్ వేసి షూట్ జరిపారు. రీసెంట్ గా ఇటలీ షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకున్నారు.
ఎస్ఎస్ఎంబీ29 ఫస్ట్ సాంగ్ పూర్తి..
ఎస్ఎస్ఎంబీ29 చిత్రానికి సంబంధించిన షూటింగ్ పార్ట్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే చిత్రంలో కీలక సన్నివేశాలు, యాక్షన్ సీన్లను ఎస్ఎస్ రాజమౌళి చిత్రీకరిస్తున్నారు. మరోవైపు సాంగ్ షూట్ కూడా కొనసాగుతోందని తెలుస్తోంది. రీసెంట్ గానే ఇటలీలో మొదటి పాట షూటింగ్ పూర్తి చేసుకున్నారంట. మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా కలిసి ఈసాంగ్ లో దుమ్ములేపారని టాక్ వినిపిస్తోంది.
40 రోజుల పాటు బ్రేక్.. ఆ తర్వాత నెక్ట్స్ షెడ్యూల్
ఎస్ఎస్ఎంబీ29 రెండు షెడ్యూళ్లు ఇప్పటికే పూర్తయ్యాయి. దీంతో నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్ ఎప్పుడు జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఎండలు మండుతుండటంతో జక్కన్న ఎస్ఎస్ఎంబీ29 యూనిట్ కు సమ్మర్ హాలీడేస్ ఇచ్చారంట. 40 రోజుల పాటు షూటింగ్ కు బ్రేక్ ఇవ్వబోతున్నారని ఇన్ సైడ్ టాక్. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ సెలవుల తర్వాత వారణాసిలో షూటంగ్ జరగబోతుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











