SSMB29: ఆ హాలీవుడ్ మూవీ లాగే మహేష్ సినిమా... అసలు విషయం లీక్ చేసిన విజయేంద్ర ప్రసాద్!
ఇటీవల మహేష్ బాబు గుంటూరు కాలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి.
ఈ మధ్యనే మహేష్ బాబు గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమాకి ఎందుకో తెలియదు కానీ మొదటి ఆట నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే సంక్రాంతి కావడంతో కలెక్షన్స్ మాత్రం భారీగానే వచ్చాయి వారం రోజుల్లోనే 212 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టినట్టు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సినిమా నిర్మాత అయితే ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరి నెగిటివ్ రివ్యూస్ ఇచ్చిన వారికి కౌంటర్లు ఇచ్చారు.

ఇక ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో ఎలాంటి సినిమా చేస్తారని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అయితే వీరిద్దరూ కలిసి చేయబోతున్న ప్రాజెక్టుకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది.
అదేమిటంటే ఈ సినిమాకి కథ అందిస్తున్న రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా స్క్రిప్ట్ వరకు పూర్తయినట్లు అధికారికంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేకాదు ఈ సినిమా ఇండియానా జోన్స్ లాగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు టైటిల్ గురించి కూడా ఏమీ అనుకోలేదని సినిమా కథ ఎక్కువగా అడవి నేపథ్యంలోనే ఉంటుందని వెల్లడించారు.

ఇలా చెబుతున్నాం కాబట్టి ఇదేదో పీరియాడికల్ మూవీ అనుకుంటారేమో కాదు ఇప్పటి తరానికి సంబంధించిన కథని రాజమౌళి తెరకెక్కించబోతున్నారని చెప్పుకొచ్చారు. ఇక మహేష్ బాబుకు పాన్ ఇండియా ఇమేజ్ కాదు అంతకుమించి ఇమేజ్ వస్తుందని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.
ఇక ఇండియాలో జోన్స్ గురించి మా వాళ్లకు పెద్దగా పరిచయం లేదు కానీ.. హాలీవుడ్ సినిమాలు కొంచెం ఫాలో అయ్యే వారికి పరిచయమే ఈ సినిమాల ద్వారా ఇప్పటికే 15 వేల కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చాయి. 81 లో రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్ అనే సినిమాతో మొదలైన ఈ ఫ్రాంచేసిలో ఇప్పటివరకు నాలుగు సినిమాలు వచ్చాయి.

ఇప్పుడు అలాంటి కథలనే తెలుగు ప్రేక్షకులకు సహా ఇండియా మొత్తం ఆనందించే విధంగా రాజమౌళి డిజైన్ చేయబోతున్నారని తెలుస్తోంది. కానీ ఎప్పుడు ప్రీ ప్రొడక్షన్ పంపిస్తారని విషయం మీద ఇంకా క్లారిటీ లేదని అదంతా రాజమౌళి ఇష్టమని ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











