SSMB29: మహేశ్ సినిమాలో విలన్ గా బాలీవుడ్ బ్యూటీ.. జక్కన్న ప్రయోగం మామూలుగా లేదుగా..

SSMB29 Update: సూపర్ స్టార్ మహేశ్ బాబు - దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో ఎస్ఎస్ఎంబీ29 రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. అటు మహేశ్ బాబు చివరిగా 'గుంటూరు కారం', ఇటు జక్కన్న 'ఆర్ఆర్ఆర్'తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ లోని నాటునాటు సాంగ్ తో జక్కన్న ఏకంగా ఆస్కార్ అవార్డునే వరించారు. దాంతో తెలుగు సినిమాల ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా మరింతగా పెరిగిపోయింది. ఈ క్రమంలో స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎప్పుడు అనౌన్స్ కానుందనేది ఉత్కంఠ నెలకొల్పుతోంది. అయితే.. ఈ సినిమాలో జక్కన్న, దర్శక ధీరుడు రాజమౌళి ఎవరూ ఊహించిన ప్రయోగం చేస్తున్నారంట. ఇంతకీ ఆ ప్రయోగమేంటంటే?

SSMB29 సినిమాకు సంబంధించిన ఫార్మల్ పూజా కంప్లీట్ అయ్యిందని, యూనిట్ తో జక్కన్న చిత్రీకరణ ప్రారంభించే పనిలో ఉన్నారని తెలుస్తోంది. దీన్ని స్పష్టం చేస్తూ జకన్న ఇటీవల మహేశ్ బాబు పాస్ట్ పోర్ట్ ను లాగేసుకున్నట్టు పెట్టిన పోస్టు తెగ వైరల్ అయ్యింది. ఈ క్రమంలో జక్కన్న టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ల్లోని స్టార్ యాక్టర్స్ ను తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక అప్పటి నుంచి జక్కన్న ఎప్పుడు ఎలాంటి అప్డేట్స్ ఇస్తారోననేది ఆసక్తికరంగా మారింది. .

SSMB29 Priyanka Chopra to play villain against Mahesh Babu in SS Rajamouli s pan-Indian film

ఈలోగా ఎస్ఎస్ఎంబీ29 గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ చిత్రంలో భారీ కాస్ట్ ను ఎంపిక చేస్తున్న రాజమౌళి.. బాలీవుడ్ లో హాలీవుడ్ లో సంచలనంగా మారిన ప్రియాంక చోప్రాను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇండస్ట్రీలో గట్టి ప్రచారం జరుగుతోంది. అయితే ప్రియాంక చోప్రాను హీరోయిన్ గా కాకుండా విలన్ పాత్ర కోసం తీసుకుంటున్నారని కూడా తెలుస్తోంది. దీనిపై మరింతగా క్లారిటీ రావాల్సి ఉంది.

ప్రియాంక చోప్రాను తీసుకోవడం వెనుక జక్కన్న ప్లాన్ మామూలుగా లేదు. ప్రియాంక వల్ల బాలీవుడ్ తో పాటు అటు హాలీవుడ్ లోనూ సినిమాను ప్రమోట్ చేసే అవకాశం ఉంది. అయితే.. జక్కన్న తన కెరీర్ లో మొదటిసారి హీరోయిన్ తో విలన్ పాత్రను ప్రజెంట్ చేయబోతుండటం ఆసక్తికరంగా మారింది. జక్కన్న సినిమాల్లో విలన్లు ఎంత పవర్ ఫుల్ గా ఉంటారో తెలిసిందే. ఇక హీరోయిన్ ను నెగెటివ్ రోల్ లో ఎలా చూపిస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మరోవైపు బాలీవుడ్ నుంచి జాన్ అబ్రహంను, సౌత్ నుంచి పృథ్వీ సుకుమారన్ నుంచి కీలక పాత్రల కోసం సంప్రదించినట్టు తెలుస్తోంది.

SSMB29 Priyanka Chopra to play villain against Mahesh Babu in SS Rajamouli s pan-Indian film

ఇక హీరోయిన్ గా ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజిబెత్ ఇస్టాన్ ను ఎంపిక చేశారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. త్వరలో మిగితా నటీనటులపైనా క్లారిటీ రానుంది. ఏదేమైనా జక్కన్న ఎస్ఎస్ఎంబీ29తో వరల్డ్ వైడ్ సినిమాలతో పోటీ పడాలని చూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ఇండస్ట్రీ సత్తాను చాటేందుకు కృషి చేస్తున్నారు. ఈ భారీ చిత్రానికి స్టార్ రైటర్ విజేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ విషయంపై ఇప్పటి వరకూ ఎలాంటి స్పష్టత లేదు.

More from Filmibeat

Read more about: priyanka chopra rajamouli ssmb29
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X