SSMB29లో ఆ సీనియర్ హీరో?.. మహేశ్‌ను మించి అమ్మాయిల్లో క్రేజ్, రాజమౌళి ప్లానింగ్?
ఆర్ఆర్ఆర్ తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఎస్ఎస్ఎంబీ29. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమా టాలీవుడ్ నుంచి తొలి పాన్ వరల్డ్ చిత్రంగా చరిత్ర సృష్టించనుంది. దాదాపు రూ.1000 కోట్లకు పైగా బడ్జెట్‌తో భారీ తారాగణంతో, హై టెక్నీకల్ వాల్యూస్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు రాజమౌళి. వీలైనంత త్వరగా చిత్రీకరణను పూర్తి చేసి సినిమాను విడుదల చేయాలని రాజమౌళి పట్టుదలగా ఉన్నారు.
ఎస్ఎస్ఎంబీ 29 విడుదల ఎప్పుడు
రాజమౌళి సినిమా అంటే ఎప్పుడో పూర్తవుతుందో? ఎప్పుడు రిలీజ్ అవుతుందో? అన్న ముద్ర ఉంది. ఎస్ఎస్ఎంబీ 29 అనుకున్నప్పుడే రెండు నుంచి మూడేళ్లు టార్గెట్‌గా పెట్టుకున్నారట జక్కన్న. దీనిని బట్టి 2027 లేదా 2028 జనవరి నాటికి సినిమా రిలీజ్ చేయాలని ప్లానింగ్ ప్రకారం షూట్ చేస్తున్నారు. అలాగే బాహుబలి మాదిరిగా రెండు పార్ట్స్‌గా సినిమాను రిలీజ్ చేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. దీని ప్రకారం 2027లో పార్ట్ 1, 2028లో పార్ట్ 2 విడుదల చేస్తారని ఫిలింనగర్‌లో చర్చ జరుగుతోంది.

రెండు భాగాలుగా ఎస్ఎస్ఎంబీ 29
అయితే ఎస్ఎస్ఎంబీ 29ని రెండు భాగాలుగా తీసుకురావాలన్న ఉద్దేశం రాజమౌళికి లేదని మరో వర్గం వాదన. మరీ ఎక్కువ సాగదీయకుండా సూటిగా సుత్తి లేకుండా తను చెప్పాలనుకున్నది చెప్పాలని భావిస్తున్నారట. అదే సమయంలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, గూస్ బంప్స్ తెప్పించే ఎలివేషన్స్ ఈ చిత్రంలో దండిగా ఉండనున్నాయని టాక్. ఇక ఎస్ఎస్ఎంబీ 29 వర్కింగ్ టైటిల్‌తో సెట్స్ మీదకు వెళ్లిన ఈ భారీ చిత్రం గురించి సోషల్ మీడియాలో మీడియాలో రకరకాల కథనాలు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా నటీనటుల గురించి.
రాజమౌళీ ఆఫర్‌ను తిరస్కరించిన నానాపటేకర్?
ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌లు నటిస్తున్నారు. అయితే కొందరి పేర్లు తరచుగా తెరపైకి వస్తూ ఫలానా నటుడు లేదా నటి ఎస్ఎస్ఎంబీ 29లో కీ రోల్ ప్లే చేయబోతున్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ దిగ్గజ నటుడు నానాపటేకర్‌ను రాజమౌళి సంప్రదించినట్లుగా వార్తలు వచ్చాయి. దాదాపు రూ.20 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా నానా రిజెక్ట్ చేశారని గాసిప్స్ వైరల్ అయ్యాయి. అయితే బీటౌన్ మీడియా కావాలనే ఇలాంటి ఫేక్ న్యూస్‌ని వదులుతోందని మహేశ్ అభిమానులు ఆరోపిస్తున్నారు. రాజమౌళి అడిగితే ఇండియాలో ఒప్పుకోని నటుడు లేడని వారు చెబుతున్నారు.
ఎస్ఎస్ఎంబీ 29లో మాధవన్?
తాజాగా ఎస్ఎస్ఎంబీ 29లో మరో సీనియర్ హీరో నటించబోతున్నట్లుగా పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఆ హీరో ఎవరో కాదు తమిళ నటుడు మాధవన్. హ్యాండ్సమ్ హీరోగా, అమ్మాయిల కలల రాకుమారుడిగా మాధవన్‌కు లేడీస్‌లో ఫాలోయింగ్ ఉంది. అప్పట్లో తమకు కాబోయే భర్త మాధవన్‌లా ఉండాలని అమ్మాయిలు ఆశపడేవారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం కథాబలం, బరువైన పాత్ర ఉంటేనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు మాధవన్. ఈ క్రమంలోనే రాజమౌళి చెప్పిన పాయింట్ నచ్చడంతో ఎస్ఎస్ఎంబీ 29లో నటించేందుకు మాధవన్ అంగీకరించినట్లుగా గాసిప్స్ వస్తున్నాయి. త్వరలోనే ఆయన పాత్రకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదలవుతుందని ఫిలింనగర్‌లో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇది గాలివార్తా? లేక నిజంగానే మాధవన్‌ను రాజమౌళి కలిశారా? అన్నది త్వరలోనే తెలియనుంది.


Click it and Unblock the Notifications











