SSRMB29: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తో మహేశ్‌బాబు రొమాన్స్.. రాజమౌళి స్కెచ్ మామూలుగా లేదుగా!
SSMB29 Update: సూపర్ స్టార్ మహేష్ బాబు - స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో ఓ భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. SSMB 29గా జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ భారీ బడ్డెట్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆర్ఆర్ఆర్ (RRR) లాంటి గ్లోబల్ హిట్ తరువాత దర్శక ధీరుడు రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడం. ఈ మూవీలో సూపర్ స్థార్ మహేష్ బాబు హీరోగా నటించడంతో ఈ సినిమాపై హై ఎక్సపెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. తాజాగా ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రధాన పాత్రలో నటించనున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే?
సంక్రాంతికి గుంటూరు కారం మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. కోట్లాది రూపాయల వసూళ్లు వచ్చినా నెటిగివ్ టాక్ సొంతం చేసింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి సూపర్ స్టార్ మహేష్ బాబు - స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీపై పడింది. ప్రస్తుతం SSMB 29 భారీ బడ్డెట్ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆర్ఆర్ఆర్ (RRR)లాంటి గ్లోబల్ హిట్ తరువాత దర్శక ధీరుడు రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడం. అంచనాలు తార స్టాయికి చేరుకున్నాయి.

హాలీవుడ్ తరహాలో తెరకెక్కబోతున్న ఈ సినిమా (SSMB 29 )కోసం సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా చాలా కష్టపడుతున్నారు. తన ఫిజిక్, అండ్ లూక్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారంట. ఇటీవల మీడియా కంటబడ్డ మహేశ్ బాబు లాంగ్ హెయిర్, గడ్డంతో దర్శనమిచ్చారు. అచ్చు హాలీవుడ్ హీరోలా ఉన్నాడ్రా బాబు.. అంటూ ఫ్యాన్స్ తెగ సంబురపడుతున్నారు. ఇదెలా ఉంటే.. డైరెక్టర్ రాజమౌళి అంతకు మించి అనేలా కష్టపడుతున్నారు. ప్రస్తుతం SSMB29 సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో రాజమౌళి బిజీ బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ లోకేషన్స్ కోసం.. కెన్యా దేశంలోని అంబోసెలీ నేషనల్ పార్క్‌ను సందర్శించాడు. రీసెంట్ అక్కడి ఫోటోలను కూడా షేర్ చేసిన విషయం తెలిసిందే.
ఆ అంచనాలకు తగ్గట్టుగానే SSMB 29 సినిమాను గ్లోబల్ అడ్వెంచర్ త్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు రూ. 1000 కోట్లు వేచించనున్నారని టాక్. ఈ మూవీకి ప్రధాన నిర్మాతగా శ్రీ దుర్గా ఆర్ట్స్ డాక్టర్ కెఎల్ నారాయణ వ్యవహరించనున్నారు. 18 శతాబ్దంలో జరిగే కథను పీరియడ్ డ్రామాగా తెరకెక్కించనున్నారు. ఈ మూవీలో షూటింగ్ అధిక భాగం అడవుల్లో జరుగుతుందనీ, ఇదో ఫారెస్ట్ ఎడ్వెంచర్ మూవీ అని టాక్. ఈ మూవీ అరుదైన గిరిజన జాతికి సంబందించిన రిఫరెన్స్ లు ఉండబోతున్నాయని, వారికి సంబంధించిన కాస్ట్టూమ్స్ కూడా డిజైన్ చేస్తున్నారట. ఈ సినిమాలో చాలా మంది విదేశీ ఆర్టిస్టులు నటిస్తుండగా, సినిమాలో చిన్న చిన్న పాత్రలకు కూడా స్టార్ నటీనటులను తీసుకుంటున్నారు.

అయితే.. తాజాగా ఈ పాన్ వరల్డ్ మూవీలో మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటించనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమె స్టార్ హీరోయిన్ ఎవరో కాదు.. ఇటీవలే కల్కితో తెలుగు ప్రేక్షకులను పలకరించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె. ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె ప్రస్తుతం మూవీస్ బ్రేక్ ఇచ్చింది. అయితే.. ఈ విరామ సమయంలో కూడా కొన్ని సినిమాల కథలు వింటోందట. ఈ క్రమంలోనే SSMB 29 కథ కూడా విన్నదంట. ఈ మూవీ కథ నచ్చడంతో ఈ భారీ బడ్జెట్ మూవీలో నటించేందుకు దీపిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మరో ఏ పాత్రలో నటిస్తోంది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











