SSMB29: 8 రకాల లుక్స్‌తో రాజమౌళి ప్లాన్.. మహేష్‌బాబు గెటప్ ఎలా ఉండబోతుందంటే?
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న సినిమా SSMB29. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు మొదలవుతుందో అని మహేష్ అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. అలాగే హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కబోతున్న ఈ మూవీలో మహేష్ లుక్ ఎలా ఉండబోతుందో అనేది కూడా ఎంతో ఆసక్తిగా మారింది. కాగా తాజాగా ఈ లుక్‌కు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ వివరాల్లోకి వెళితే.
జక్కన్న రూపొందించే సినిమాలో మహేష్ బాబు గుబురు గడ్డం, లాంగ్ హెయిర్ తో కనిపించబోతున్నారట. దీంతో రాజమౌళి ఈ ఫీచర్స్ తో మొత్తం ఎనిమిది లుక్స్‌ను డిజైన్ చేయించారట. వీటిలో మహేష్ బాబుకి సెట్ అయ్యే బెస్ట్ లుక్‌ను సెలెక్ట్ చేసే పనిలో ఉన్నారనేది తాజా సమాచారం. ఇక ఈ లుక్ టెస్ట్ కోసం మహేష్ బాబు కూడా గడ్డం, జుట్టు పెంచుతున్నట్లు తెలుస్తుంది. ఇటీవల ఎయిర్ పోర్ట్‌లో మహేష్ బాబు పెరిగిన గడ్డం, జుట్టుతో కనిపించారు.

కాగా మహేష్ ఇప్పటి వరకు నటించిన అన్ని సినిమాల్లో దాదాపు ఒకే లుక్ తో కనిపిస్తూ వచ్చారు. ఇప్పుడు మొదటిసారి రాజమౌళి సినిమాలో ఓ డిఫరెంట్ లుక్‌లో దర్శనమివ్వబోతున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ సినిమా స్టోరీ ఫైనల్ స్క్రిప్ట్ లాక్ అయ్యిపోయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ని జరుపుతున్నారు.
ఈ ఏడాది సమ్మర్ లో ఈ మూవీని గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు. ఇక ఈ ఓపెనింగ్ ఈవెంట్‌కు ప్రపంచ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ ప్రత్యేక అతిథిగా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీటిలో ఎంత నిజముందో తెలియదు గానీ.. RRR సమయంలో జేమ్స్ కామెరాన్ ఒక ప్రత్యేక వీడియో చేసి రాజమౌళిని అభినందించిన సంగతి తెలిసిందే.

అంతేకాకుండా ఇటీవల ఓ అవార్డుల ఫంక్షన్ లో కూడా రాజమౌళి గురించి కామెరాన్ మాట్లాడారు. ఇవన్నీ చూస్తుంటే.. రేపు SSMB29 ఓపెనింగ్ ఈవెంట్ కి జేమ్స్ కామెరాన్ వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. కాగా ఈ సినిమాని కె ఎల్ నారాయణ, ఎస్ గోపాల్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ అంచనాలు రాజమౌళి, మహేష్ ఎలా అధగిమిస్తారో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











