మెగాస్టార్ సినిమాలో ఐటెమ్ సాంగ్.. హాట్ యాంకర్ vs స్టార్ హీరోయిన్?
మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమాతో కమర్షియల్ హంగులకు కాస్త ధూరమవ్వాల్సి వచ్చింది. ఖైదీ నెంబర్ 150సినిమాలో మెగాస్టార్ కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా అభిమానులకు మంచి కిక్కిచ్చారు. అయితే సైరా నరసింహా రెడ్డి చరిత్రాత్మక సినిమా కావడం వలన డ్యాన్స్, కామెడీ వంటి వాటిని పెద్దగా టచ్ చేయలేదు. అయితే ఆచార్య సినిమాలో మాత్రం అవి మాత్రం పుష్కలంగా ఉంటాయట.
ముఖ్యంగా సాంగ్స్ విషయంలో అభిమానులు అంచనాలు గట్టిగానే పెట్టుకున్నారు. చాలా కాలం తరువాత మణిశర్మ మెగాస్టార్ సినిమాకు సంగీతం అందిస్తుండడంతో మ్యూజిక్ ఎలా ఉండబోతోంది అనే విషయం ప్రతి ఒక్కరిలో ఆసక్తిని రేపుతోంది. అయితే ఇటీవల ఆ సినిమాకు సంబంధించిన ఒక రూమర్ అభిమానుల్లో మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. మొత్తంగా ఆచార్యలో ఐదు పాటలుంటాయట.

ఇక సినిమాలో ఒక స్పెషల్ ఐటెమ్ సాంగ్ కోసం దర్శకుడు కొరటాల తమన్నాను సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఇదివరకే ఒకేసారి హాట్ యాంకర్ అనసూయా భరద్వాజ్ ని కూడా సంప్రదించినట్లు టాక్ వచ్చింది. ఆ విషయంలో క్లారిటీ రాకముందే మళ్ళీ మిల్కిబ్యూటీతో చర్చలు జరిపినట్లు రూమర్స్ రావడంతో కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది. మరి ఈ వార్తల్లో నిజమేదో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











