మహానటి తరువాత మరో బయోపిక్‌ని రిజెక్ట్ చేసిన నిత్య మీనన్!
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ ఎంత మంది ఉన్నా కూడా కొంత మంది హీరోయిన్స్ కి మాత్రం సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా ఒక క్రేజ్ ఉంటుంది. అలాంటి వారిలో నిత్య మీనన్ ఒకరు. ఈ బ్యూటీ ఎలాంటి పాత్ర చేసినా అందులో ఎంతో కొంత కొత్తదనం ఉంటుంది. ఇకపోతే ఈ బ్యూటీ ఇటీవల ఒక బంగారం లాంటి బయోపిక్ ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

అలా..మొదలైంది
అలా..మొదలైంది సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ బ్యూటీ ఆ తరువాత ఒక కథానాయికగా కాకుండా ఒక మంచి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంది. గ్లామర్ డోస్ పెంచకుండా ఒక పరిధిలో ఉంటూ కథానాయికగా అవకాశాలు అందుకుంది. స్టార్ హీరోల సినిమాల్లో ఈ బ్యూటీ కొన్ని కీలకాపాత్రల్లో నటించింది.

ఆ బయోపిక్..
నిత్య మీనన్ గ్లామర్ డోస్ పెంచకపోయినా కూడా చాలా వరకు ఆమెకు మంచి పాత్రలే వచ్చాయి. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనే నటించి క్రేజ్ పెంచుకుంది. అయితే ఇటీవల రెండవసారి ఒక బయోపిక్ లో నటించే ఛాన్స్ రాగా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. వెయిట్ లీఫ్టింగ్ ఛాంపియన్ కరణం మల్లీశ్వరి బయోపిక్ లో మొదట నిత్యా మీనన్ ని అడిగినట్లు తెలుస్తోంది.

చర్చలు జరిగాయి..
ఒలింపిక్స్ లో ఆర్యదిక పథకాలు సాధించిన తెలుగు తేజం కారణం మల్లీశ్వరి అంటే తెలియని వారుండరు. ప్రముఖ రైటర్ కోన వెంకట్ ఆమె బయోపిక్ ని తెరకెక్కించాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో మల్లీశ్వరి పాత్ర కోసం మొదట నిత్యామీనన్ ని అనుకున్నారు. అమెతో కొన్ని రోజుల పాటు దర్శకురాలు సంజన రెడ్డి కథపై చర్చలు కూడా జరిపిందట.
Recommended Video

ఎందుకు రిజెక్ట్ చేసింది?
అయితే ఎందుకో గాని నిత్య మీనన్ మళ్ళీ మనసు మార్చుకుందట. ఇదివరకే ఒకసారి మహానటి ఆఫర్ రాగా మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న నిత్య మీనన్ కెరీర్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో మరో మంచి ఛాన్స్ ని మిస్ చేసుకుందనే కామెంట్స్ వస్తున్నాయి. గత కొంత కాలంగా నిత్య మీనన్ కి సరైన అవకాశాలు అందడం లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక మలయాళం సినిమా మాత్రమే ఉంది. మరి ఈ బ్యూటీ మల్లీశ్వరి బయోపిక్ ని ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











