బాలయ్య సినిమాలో బాలీవుడ్ స్టార్.. ఈసారి డైరెక్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా..

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న చాలా మంది ప్రముఖ నటులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలుగా చేసిన వారు కూడా ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్ తో విలన్ గా నటించేందుకు కూడా ఆసక్తిని చూపించడం విశేషం. ఇప్పటికే కొంతమంది సినీ తారలు అగ్ర హీరోల సినిమాలలో చాలా బిజీ అయిపోయారు. ప్రభాస్ రాబోయే సినిమాలలో ఎక్కువగా బాలీవుడ్ స్టార్స్ కనిపించబోతున్నారు.

అలాగే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక రామ్ చరణ్ చేయబోయే బుచ్చిబాబు ప్రాజెక్టులో కూడా ఒక బాలీవుడ్ స్టార్ ప్రధాన పాత్రలో కనిపించబోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక నందమూరి బాలకృష్ణ సినిమాలో కూడా ఒక బాలీవుడ్ స్టార్ ప్రధాన విలన్ గా అబ్బురపరిచే పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి.

Star bollywood actor to play the villain in nandamuri balakrishna upcoming movie

దర్శకుడు అనిల్ రావిపూడి తెరపైకి తీసుకురాబోతున్న ఈ ప్రాజెక్టు వర్కింగ్ టైటిల్ గా NBK 108 గా సెట్ చేసిన విషయం తెలిసిందే. ఇక త్వరలోనే పవర్ ఫుల్ టైటిల్ ను పోస్టర్ ద్వారా విడుదల చేయబోతున్నారు. అయితే ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమాలో విలన్ పాత్రలో కనిపిస్తున్న ఈ యాక్టర్ ఇప్పుడు బాలకృష్ణ సినిమాల్లో కూడా భయంకరమైన ప్రతినాయకుడి పాత్రలో మెప్పించబోతున్నట్లుగా తెలుస్తోంది.

దర్శకుడు అనిల్ రావిపూడి ఈసారి కమర్షియల్ ఫార్మాట్లో మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెంచుకునే ఈ సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నాడు. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నాడు. ఇక శ్రీ లీల బాలకృష్ణ కూతురుగా కనిపించపోతుండగా కాజల్ అగర్వాల్ బాలయ్య బాబుకు జోడిగా నటిస్తోంది. ఈ సినిమాను ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయాలి అని చిత్ర యూనిట్ ఒక టార్గెట్ అయితే పెట్టుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X